29.2 C
Hyderabad
November 8, 2024 14: 51 PM
Slider తెలంగాణ

బీ వేర్ అఫ్ కెసిఆర్:ఆయనతో స్నేహం చేస్తే జగన్ కు చీకటే

revanth reddy

కేసీఆర్ తో స్నేహం చేస్తే కొర్రాయి తో తలా గోక్కున్నట్లే అని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం జగన్‌ ను ఎద్దేవా చేశారు.దిల్లీలో రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తో స్నేహం పుణ్యమా అని జగన్ మండలిని రద్దుచేసారని అన్నారు.పక్కరాష్ట్రంలో అస్థిర పరిస్థితులు ఉంటె తమకు ఇబ్బంది ఉండదనే జగన్‌కు కేసీఆర్‌ ఇలాంటి సలహాలు ఇచ్చినట్లు తెలుస్తుందన్నారు.

‘‘లోక్‌సభలో బిల్లులు ఆమోదం పొంది రాజ్యసభలో తిరస్కరణ గురవడం సెలెక్ట్‌ కమిటీకి పంపడంలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంతమాత్రాన రాజ్యసభను రద్దు చేయాలనోపెద్దల సభ నుంచి సలహాలు, సూచనలు వద్దనో ఇప్పటి వరకు ఏ ప్రధాని చెప్పలేదు. పెద్దల సభలో బిల్లు ఆమోదం పొందనంతమాత్రాన సభనే రద్దు చేయడం దురదృష్టకరం అన్నారు.

కేసీఆర్‌ను నమ్మినవారు బాగుపడినట్లు చరిత్రలో లేదు. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి 2009లో చంద్రబాబుకి కేసీఆర్‌ వెన్నుపోటు పొడిచారని 2014లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటే పార్టీని విలీనం చేస్తామని సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్‌ను పక్కాగా నమ్మబలికి కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారన్నారు.కేసీఆర్‌ సలహాలను జగన్‌ పాటిస్తే మాత్రం ఆయనకు భవిష్యత్‌లో చీకటే తప్ప వెలుగు ఉండదు’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు

Related posts

ఆటో,వ్యాన్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తా

Satyam NEWS

మట్టపల్లి దేవాలయ అభివృద్ధికి రైతులు సహకరించాలి

Satyam NEWS

వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ సాయం

Satyam NEWS

Leave a Comment