34.7 C
Hyderabad
May 5, 2024 01: 28 AM
Slider ముఖ్యంశాలు

బొక్కబోర్లా పడ్డా బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదు: రేవంత్ రెడ్డి

#revanthreddy

బోర్లా పడి బొక్కలు విరిగినా బీఆరెస్ కు బుద్ది రాలేదు.. నెల రోజులు గడవకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారు…. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆరెస్ దోచుకుంది. బీఆరెస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలి. టార్గెట్ 17 పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో పనిచేయాలి. రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్ సభ స్థానాలు గెలిపించుకోవాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 8న 5జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమీక్షిస్తానని ఆయన తెలిపారు.

ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇంఛార్జ్ లతో సన్నాహక సమావేశం నిర్వహిస్తాం. 20 తరువాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందిరా భవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నేడు టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సమావేశంలో మూడు తీర్మానాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కి అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశారు. అదే విధాంగా తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పనిచేసిన మాణిక్ రావు ఠాక్రే అభినందిస్తూ రెండవ తీర్మానం చేశారు.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి తెలిపారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి.. వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత మాది అని ఆయన అన్నారు. ఎన్నికల్లో పని చేసిన నేతలని గుర్తించి స్థాయిలను బట్టి వారికి ప్రభుత్వం లో చైర్మనలు ,డైరెక్టర్లు పదవులు ఇవ్వడానికి ఏఐసీసీ ఇంచార్జ్ , సెక్రెటరీలు లిస్ట్ ని తయారు చేస్తున్నారు.. త్వరలోనే వారికి పదవులు ఉంటాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తెలిపారు.

Related posts

కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు

Satyam NEWS

సూపర్ స్టార్ కృష్ణకు మంగళగిరి అభిమానులు నివాళులు

Satyam NEWS

పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరం

Bhavani

Leave a Comment