31.7 C
Hyderabad
May 7, 2024 01: 49 AM
Slider విజయనగరం

“జగనన్నకు చెబుదాం” ఫిర్యాదుల పరిష్కరణలో రాష్ట్రంలో ప్రధమ స్థానం

#vijayanagaramsp

విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో ఆఫ్ ఇయర్ నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపి జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు. ఈ డీసీఆర్బీ సమావేశంలోవారం వారం జరుగుతున్న “జగనన్న కు చెబుదాం” స్పందనలో ప్రతిభ కనబరచిన సిబ్బందికి ఎస్పీ జ్ఞాపికలు ఇచ్చారు.

ఎస్పీ చేతులు మీదుగా అందుకున్న వారిలో సీఐలు మురళీ, డా.వెంకటరావు, అలాగే ఎస్ఐ లు వాసుదేవ్ ,అశోక్ కుమార్ లు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ తీవ్రమైన నేరాలకు సంబంధించి గత అర్ధ సంవత్సరంలో నమోదై, దర్యాప్తు పెండింగు ఉన్న కేసుల్లో దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని, దర్యాప్తులో సేకరించిన ఆధారాలను సాక్ష్యాలుగా మార్చేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపాలని, నిందితులు శిక్షింపబడే విధంగా వాటిని సాంకేతిక నైపుణ్యంతో సాక్ష్యాలుగా చూపాలని అధికారులను ఆదేశించారు. పోలీసు స్టేషనుకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, కేసులు నమోదు చెయ్యాలన్నారు. ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో కొట్లాటల, హత్యాయత్నాలు, మహిళలపై దాడులు, దొంగతనాలు, పోక్సో కేసులు వంటి నేరాలు గత సంవత్సరం కంటే తక్కువగాను లేదా ఎక్కువగాను నమోదటకుగల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పోలీసు అధికారులు, సిబ్బంది విధిగా తమ పరిధిలో పాఠశాలలు, కళాశాలలను సందర్శించి, విద్యార్థులకు పోక్సో చట్టం అవగాహన కల్పించాలన్నారు. ఆస్తికి సంబంధించిన నేరాలు, బైకు దొంగతనాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాలను నియంత్రించుటలో భాగంగా సైనేజస్ ఏర్పాటు చేయాలని, వాహన తనిఖీలు చేపట్టాలని, మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపైన, ఎం.వి. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు.

బహిరంగ ప్రదేశాలో మద్యం సేవించిన వారిపైన, పేకాట ఆడుతున్న వారిపైన, అనధికారంగా మద్యం విక్రయాలు చేస్తున్న వారిపైన కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి సేవించే వారిపైన, గంజాయిని విక్రయించే చిన్న వ్యాపారులపైన, గంజాయి అక్రమ రవాణకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. రౌడీ షీట్లు కలిగిన వారిపై నమోదైన కేసులను ప్రాధాన్యత కేసులుగా తీసుకొని, ప్రాసిక్యూషన్ త్వరితగతిన పూర్తయ్యే విధంగా సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో మాట్లాడి, సకాలంలో సాక్షులను ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. దర్యాప్తు పెండింగు లో ఉన్న అదృశ్యం మరియు ఇతర కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసి, సంబంధిత కోర్టుల్లో అభియోగ పత్రంలు దాఖలు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు.

ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ

“జగనన్నకు చెబుదాం” పోర్టల్ కు వచ్చే, ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించుటలో గత మూడు మాసాలుగా జిల్లా పోలీసుశాఖ రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలించిందని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. “జగనన్నకు చెబుదాం” పోర్టల్ కు వచ్చే, ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించుటలో గత మూడు మాసాలుగా జిల్లా పోలీసుశాఖ రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలించిందని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఈ పోర్టల్ పర్యవేక్షణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న డిసిఆర్బీ (జె.కే.సి) ఎస్ఐ జి.బాలకృష్ణను “బెస్ట్ పెర్ఫార్మర్” గా జిల్లా ఎస్పీ ఎంపిక చేసి, జ్ఞాపికను బహూకరించారు.

అదే విధంగా పోక్సో కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల కు పైబడి శిక్షలు విధించుటలో క్రియాశీలకంగా వ్యవహరించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎం. శంకరరావును, హత్య కేసుల్లో నిందితులు శిక్షింపబడుటలో క్రియాశీలకంగా వ్యవహరించిన పబ్లిక్ ప్రాసిక్యూటరు వి. రఘురాం లను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేసారు.

సారిపల్లిలోని పోలీసు శిక్షణ కేంద్రంలో నిర్వహించిన అర్ధసంవత్సర ఫైరింగు ప్రాక్టీసులో జిల్లాలో పని చేస్తున్న అధికారులు పాల్గొని, ఫైరింగు ప్రాక్టీసు చేయగా, ఈ ఫైరింగు ప్రాక్టీసులో ప్రతిభ కనబర్చిన విజయనగరం వన్ టౌన్ సీఐ. డా. బి.వెంకటరావు ప్రధమ స్థానంలోను, డీసీఆర్బీలో ఎస్ఐగా పని చేస్తున్న ఆర్.వాసుదేవ్ ద్వితీయ స్థానంలో నిలవగా, వారిని జిల్లా ఎస్పీ అభినందించి, జ్ఞాపికలను బహూకరించారు. అదే విధంగా వివిధ పోలీసు విధులను సమర్ధవంతంగా నిర్వహించిన దిశ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డీసీఆర్బీ సిఐ జె.మురళి, ఆర్.ఎ.వలస ఎస్ఐ ఈ. శ్రీనివాస్, వన్ టౌన్ ఎస్ఐ వి. అశోక్ కుమార్, బొండపల్లి ఎస్ఐ ఎస్.రవి, గజపతి నగరం ఎస్ఐ సిహెచ్.గంగరాజు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, విజయనగరం డిఎస్పీ ఆర్. గోవిందరావు,

చీపురుపల్లి డిఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి, బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీధర్, దిశ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డిటిసి డిఎస్పీ వీరకుమార్, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, న్యాయ సలహాదారులు వై. పరశురాం, సిఐలు కే.కే.వి. విజయనాధ్, జె. మురళి, ఈ. నర్సింహమూర్తి, బి.వెంకటరావు, విజయ ఆనంద్, బి. నాగేశ్వరరావు, ఎం. నాగేశ్వరరావు, హెచ్.ఉపేంద్రరావు, కే. రవికుమార్, ఎల్.అప్పలనాయుడు, వి.చంద్రశేఖర్, ఎం. బుచ్చిరాజు, ఎస్. తిరుమలరావు, వెంకటేశ్వరరావు, రాజశేఖర్, జి.సంజీవరావు, ఆర ఎన్. గోపాల నాయుడు, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్

Satyam NEWS

వేణుగానాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం..

Satyam NEWS

గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన సూపర్ స్టార్ కృష్ణ

Satyam NEWS

Leave a Comment