27.7 C
Hyderabad
May 11, 2024 10: 36 AM
Slider జాతీయం

రాఖీ పండుగ గిఫ్ట్: గ్యాస్ సిలెండర్ ధర తగ్గింపు

#modinew

రక్షాబంధన్‌ సందర్భంగా మహిళలలు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలో తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాఖీ పండుగ సందర్భంగా కేంద్రం  గృహోపయోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై  రూ.200 చొప్పున తగ్గించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఇంట్లో వినియోగించే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో రూ.1103గా ఉంది. తగ్గించిన తర్వాత రూ.903కి తగ్గనుంది. ఉజ్వల పథకం కింద వంట గ్యాస్‌ పొందిన వారికి సబ్సిడీ కింద రూ.200 ఇస్తుండగా.. తగ్గింపుతో వారికి రూ.400 మేర ప్రయోజనం చేకూరనుంది. అంటే వారికి గ్యాస్‌ సిలిండర్ రూ.703కే లభించనుంది. అలాగే, ఉజ్వల పథకం కింద కొత్తగా మరో 75 లక్షల కొత్త వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. కొత్తగా ఇవ్వనున్న కనెక్షన్లతో కలిపితే ఈ లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరనుంది.

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పలుమార్లు సవరించిన ఆయిల్‌ కంపెనీలు.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరను మాత్రం స్థిరంగా ఉంచాయి. చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున ఆయిల్‌ కంపెనీలు పెంచాయి. మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Related posts

త్రీ ఈడియట్స్: మైనర్ బాలికపై అత్యాచార యత్నం

Satyam NEWS

అక్రమ సంబంధం పర్యవసానంగా వివాహితపై విచక్షణారహిత దాడి

Satyam NEWS

పురుగుల మందు డబ్బాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment