42.2 C
Hyderabad
May 3, 2024 18: 26 PM
Slider గుంటూరు

మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్

#Narasaraopet Municipality

కరోనా రోగులతో నిన్నమొన్నటి వరకూ ఊపిరితీసుకునే వీలుకూడా లేకుండా సతమతం అయిన గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఇప్పుడు అధికారులు మరింత కఠినంగా ఉంటున్నారు. మాస్కు లేకుండా తిరుగుతున్న వారిపై భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు.

నేడు ఒక్క రోజే మాస్కు లేకుండా తిరుగుతున్న 13 మందికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు. నరసరావుపేట మునిసిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వార్డ్ ప్లానింగ్ సెక్రటరీస్, వార్డ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, మునిసిపల్ సిబ్బంది నేడు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వ్యాపారస్తులు, వినియోగదారులు, వాహనదారులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అన్నారు. మాస్కులేక పోతే  జరిమానా విధించి అవసరమైతే జైలుకు కూడా పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబయ్య, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అనురాధ మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వైద్యశాలలో స్కానింగ్ సెంటర్,రక్త నిధి కేంద్రం ఏర్పాటు చేయాలి

Satyam NEWS

రామతీర్ధం లో రామయ్య పెళ్లికి ఏర్పాట్లు పూర్తి..!

Satyam NEWS

ఆదివాసీలను ప్రభుత్వాలు కాపాడాలి

Satyam NEWS

Leave a Comment