36.2 C
Hyderabad
May 8, 2024 18: 19 PM
Slider తెలంగాణ

బీసీ విద్యార్ధుల భవిష్యత్తు కోసం కలిసి పని చేద్దాం

kamalakar

బీసీ విద్యార్థుల భవిష్యత్ కోసం అందరూ కలిసి పనిచేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నేడు హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ లో అన్ని జిల్లాల బీసీ వెల్ఫేర్ అధికారులు, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఇక మిదట ఎన్నికలు ఏమీ లేనందున అన్ని జిల్లాల్లో పర్యటించి పరిస్థితి ని పరిశీలిస్తానని మంత్రి  చెప్పారు. అలాగే పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ బీసీ హాస్టల్ లను సందర్శించాలని మంత్రి కోరారు. త్వరలో సంక్షేమ హాస్టల్లో పరిశీలన జరుపుతామని లోపాలు ఉంటే ఇప్పుడే సరిదిద్దుకోవాలని ఆయన అన్నారు.

సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి కోసం చేపట్టవలసిన పనుల విషయమై ప్రత్యేక  కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, అడిషనల్ సెక్రెటరీ సైదా, బీసీ కార్పొరేషన్ ఎం డి ఆలోక్ కుమార్, జ్యోతిబా పూలే కార్యదర్శి  మల్లయ్య భట్, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి కంది శ్రీనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

‘ఈవా ఐవీఎఫ్’ ఆసుపత్రితో సమస్య సమసిపోయింది

Satyam NEWS

చెత్తపలుకు: రోదనే తప్ప వేరే ఆలోచన లేదు

Satyam NEWS

జి ట్యాంకర్ పేలుడులో 18 మంది భారతీయుల మృతి

Satyam NEWS

Leave a Comment