31.2 C
Hyderabad
May 3, 2024 02: 42 AM
Slider సినిమా

ఫుల్ మీల్స్ వినోదం పంచే క్రేజీ అంకుల్స్‌

#crazyunclesmovie

న‌టీన‌టులు: శ్రీ‌ముఖి, రాజా ర‌వీంద్ర‌, సింగ‌ర్ మ‌నో, భ‌ర‌ణి, పోసాని కృష్ణ‌ముర‌ళి, గిరి,  అదుర్స్ ర‌ఘు, హేమ‌, గాయ‌త్రి భార్గ‌వి త‌దిత‌రులు...
ఎడిటింగ్ః  నాగేశ్వ‌ర‌రెడ్డి
సంగీతం: ర‌ఘు కుంచె,
నిర్మాణం: గుడ్ సినిమా గ్రూప్‌
ద‌ర్శ‌క‌త్వం: ఇ.స‌త్తిబాబు

సత్యం న్యూస్ రేటింగ్ : 3.25

బుల్లితెర‌పై క్రేజీ యాంక‌ర్‌గా పేరుతెచ్చుకున్న శ్రీ‌ముఖి ప్ర‌ధాన పాత్ర‌లో సీనియ‌ర్ న‌టులు సింగ‌ర్ మ‌నో, రాజా ర‌వీంద్ర‌, భ‌ర‌ణి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్రం క్రేజీ అంకుల్స్‌…కొన్ని సినిమాలు విడుద‌ల‌కు ముందే పాజిటివ్ షేడ్స్ క‌లిగిస్తాయి. పేరుతోనే స‌గం హిట్ సాధించిన చిత్రం క్రేజీ అంకుల్స్‌. పేరు చూడ‌గానే వినోదాత్మ‌క చిత్రం అని నూటికి నూరు శాతం చెప్ప‌వ‌చ్చు. సినిమా విడుద‌ల కాక‌ముందే శ్రీ‌ముఖిపై చిత్రీక‌రించిన సాంగ్ 10 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్‌ను సాధించింది. అంతేకాదు ప్ర‌చార చిత్రాలు సోష‌ల్ మీడియాలో హోరెత్తించాయి. ఇంత‌లా క్రేజ్ తెచ్చుకున్న చిత్రం ఈ మ‌ధ్య‌కాలంలో లేద‌నే చెప్పాలి. మ‌రి ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ విధంగా మెప్పించిందో తెలుసుకుందామా…

కథ ఎలా ఉందంటే…:

ఆర్ ఆర్ ఆర్ అక్ష‌రంతో మొద‌ల‌య్యే ముగ్గురు అపార్ట్‌మెంట్ మిత్ర త్రయం చేసే వినోదాత్మ‌క ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. రెడ్డి (సింగర్ మనో), రాజు (రాజా రవీంద్ర), రావు (భరణి) ముగ్గురు స్నేహితులు. ముగ్గురికి తమ భార్యలతో కొన్ని సమస్యలు ఉంటాయి. దాంతో తమ సంసార జీవితంలో దొరకని సుఖాన్ని బయట వెతుక్కుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఫేమస్ సింగర్ స్వీటీ (శ్రీ‌ముఖి) పై ముగ్గురు కన్ను పడుతుంది. ఆమెతో పరిచయం పెంచుకుని ఆమెతో గడపాలని రెడ్డి, రాజు, రావు ఒకరికి తెలియకుండా ఒకరు ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? ఇంతకీ స్వీటీతో వాళ్ళ బంధం ఎంతవరకు సాగింది ? చివరకు ఈ ముగ్గురు జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

క్రేజీ అంకుల్స్ గా నటించిన సింగర్ మనో, రాజా రవీంద్ర, భరణి తమ పాత్రలకు తగ్గట్లు తమ బాడీ లాంగ్వేజ్ ను బాగా మెయింటైన్ చేశారు. ముఖ్యంగా మనో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు శ్రీముఖి గురించి అసలు నిజం తెలిసే సన్నివేశంలో, అలాగే క్లైమాక్స్ సన్నివేశంలో ‘మనో’ ఎంతో అనుభవం ఉన్న నటుడిలా బాగా అభినయించాడు. ఒక్కో సంద‌ర్భంలో బ్ర‌హ్మానందాన్ని గుర్తుచేశాడు. మ‌నోకి ఈ మూవీ త‌ర్వాత మ‌రిన్ని కామెడీ ఆఫ‌ర్లు పుష్క‌లంగా వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక స్వీటీ అనే సింగర్ గా నటించిన శ్రీముఖి కొన్ని బోల్డ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. యోగా గురువుగా కనిపించిన పోసాని తన పాత్రలో ఒదిగిపోయారు. దర్శకుడు ఇ. స‌త్తిబాబు రాసుకున్న కొన్ని సన్నివేశాలు క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. క‌థాప‌రంగా చూస్తే సింపుల్‌గానే క‌నిపించినా సీనియ‌ర్ల న‌ట‌నా ప్ర‌తిభ‌తో క్రేజీ అంకుల్స్ వినోదానికి ఢోకా లేకుండా చేస్తుంది. నిర్మాణ విలువ‌లు రిచ్‌గా ఉన్నాయి. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మాత‌లు త‌మ స‌హ‌కారం అందించారు. ద‌ర్శ‌కుడికి కావ‌ల‌సినంత స్వేచ్ఛ‌నిచ్చారు. సాధార‌ణంగా ఈ మ‌ధ్య వ‌స్తున్న సినిమాలు కేవ‌లం వినోదంతోనే స‌రిపెడుతుండ‌గా క్రేజీ అంకుల్స్ క్రైమాక్స్‌కు ముందు వ‌చ్చే ట్విస్ట్ స‌మాజానికి మంచి మెసేజ్‌ను కూడా ఇస్తుంది.
శ్రీ‌ముఖి త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. ఇక క్రేజీ అంకుల్స్‌గా రాజా ర‌వీంద్ర‌, మ‌నో, భ‌ర‌ణి ముగ్గురూ కామెడీని త‌మ భుజాల మీద వేసుకుని చ‌క్క‌గా అభిన‌యించి ప్రేక్ష‌కుల‌కు కావ‌ల‌సినంత వినోదాన్ని పంచారు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో గిరి వేసే పంచ్  డైలాగులు, పోసాని యోగా విన్యాసాలు వినోదాన్ని మ‌రింత పెంచాయి.

ఫైన‌ల్‌గా..

వినోదాత్మ‌క చిత్రాల‌ను చూసి ఎంజాయ్ చేసేవారికి మంచి కాల‌క్షేపం అవుతుంది ఈ సినిమా. అంత‌కు మించి ఎక్కువ ఆశించ‌కుండా చూసేవారికి ఫుల్ మీల్స్ కామెడీ మూవీ.

నండూరి ర‌విశంక‌ర్‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌

Related posts

సంగీత క‌ళా న‌గ‌రంలో ల‌తామంగేష్క‌ర్ అవార్డు గ్ర‌హీత‌చే హిందుస్థానీ క‌చేరీ

Satyam NEWS

కరోనా పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Satyam NEWS

ఘనంగా చర్లపల్లి పాస్టర్ ఫెలోషిప్ క్రిస్మస్ సెలబ్రేషన్స్

Bhavani

Leave a Comment