31.7 C
Hyderabad
May 7, 2024 00: 37 AM
Slider వరంగల్

పిల్లలకు పౌష్టికాహారం అందిస్తే విద్యలో ఏకాగ్రత

#ilatripathi

పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో విద్యలో ఏకాగ్రత మెరుగు పడుతుందని, అందుకే ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తున్నామని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం గోవిందరావు పేట మండలం, పసర నాగారం లోని జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాలలో  జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు ఉదయాన్నే వ్యవసాయం, ఇతర కూలి పనులకు వెళ్లడంతో పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు ఉపవాసంతో ఉండకుండా, ప్రభుత్వం  అల్పాహార పథకాన్ని ప్రవేశ పెట్టిందని, జిల్లాలో పటిష్టంగా అమలు పరచాలని అన్నారు. పిల్లలు శక్తివంతంగా ఉంటేనే తరగతి గదులలో అలసిపోకుండా ఉంటారని అన్నారు. సరియైన ఆహారం పిల్లలు తీసుకున్నప్పుడే వారు శక్తివంతంగా ఉంటారని అన్నారు.

తెలంగాణ తేజస్సులుగా విద్యార్థులు ఎదగాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అధిక నిధులు వెచ్చిస్తూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తూ, విద్యార్థులకు ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫారాలు అందించడం జరుగుతున్నదని అన్నారు.  జిల్లాలో మొదటి దశలో మన ఊరు- మన బడి కార్యక్రమం కింద 125 పాఠశాలల్లో పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

రానున్న కాలంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆంగ్ల బోధన అభ్యాసం చేయడం, తోలి మెట్టు కార్యక్రమం ద్వారా విద్యార్థులు బోధన, విద్యాభ్యాసం లను పరిశీలించి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులను ఏర్పాటు చేసి విద్యా బోధన అందించడం జరుగుతున్నదని, అల్పాహారం పథకం ద్వారా విద్యార్థుల్లో చురుకుదనం కలిగి నాణ్యమైన విద్య అభ్యసించడం జరుగుతుందని తెలిపారు.

ఈ పథకం అమలును పటశాల మేనేజ్ మెంట్ కమిటీలు, సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం మెనూ రూపొందించిందని, దాని ప్రకారం నాణ్యతతో విద్యార్థులకు అల్పాహారం  పెట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్వయంగా జిల్లా కలెక్టర్ టిఫిన్ వడ్డించి వారితో కలిసి టిఫిన్ చేశారు.

టిఫిన్ నాణ్యత, రుచిపై కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.  ప్రతిరోజు పిల్లలు ఉదయమే పాఠశాలకు వచ్చి చేతులు మంచిగా శుభ్రం చేసుకొని అల్పాహారం స్వీకరించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా డిఇఓ, ఎంపీడీవో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ ఇంఛార్జి డి. ఎస్. వెంకన్న, డి ఈ ఓ పాణిని, డి పి ఓ వెంకయ్య, తహసిల్దార్ రాజ్ కుమార్, ఎంపిడిఓ ప్రవీణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సి డి పీఓ మల్లీశ్వరి, సైన్స్ ఆఫీసర్ జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల వితరణ

Satyam NEWS

బిచ్కుంద మండల ఉత్తమ సర్పంచులకు ప్రశంస

Satyam NEWS

కోవూరు దళిత వాడలో కానిస్టేబుల్ దారుణం…

Satyam NEWS

Leave a Comment