31.2 C
Hyderabad
May 3, 2024 02: 11 AM
Slider విశాఖపట్నం

సముద్రంలో గల్లంతయిన వారిని రక్షించే లైఫ్ రోబో

#liferobo

సముద్రంలో స్నానాలకు దిగి తరచూ ఎవరో ఒకరు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి వారిని రక్షించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అన్నారు. వైజాగ్‌ సేవ్‌ సంస్థ దీని కోసం ‘లైఫ్‌ బోయ్‌’ రోబో యంత్రాలను తయారు చేసిందన్నారు. పూర్తిగా బోటు మాదిరిగా పనిచేసే రోబో ఏకకాలంలో ముగ్గురిని రక్షిస్తుందన్నారు. తీరం నుంచి 600 మీటర్ల దూరం వరకూ దీనిని పంపించవచ్చునన్నారు. దీని ఖరీదు రూ.5.5 లక్షలు అని సంస్థ తెలిపిందని కలెక్టర్‌ పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా మాట్లాడుతూ దేశంలోనే ఇటువంటి రోబో మొదటిదన్నారు. ప్రభుత్వ అనుమతితో వీటి కొనుగోలుకు ప్రయత్నిస్తామన్నారు.

Related posts

గంటస్థంభం సాక్షిగా 60 వాహనాలపై కేసులు..

Satyam NEWS

పతంగులు ఎగరేస్తున్నారా! విద్యుత్ లైన్లతో జాగ్రత్త

Satyam NEWS

గుండెల్ని కట్టిపడేస్తున్న “రైతు పాట”

Satyam NEWS

Leave a Comment