37.2 C
Hyderabad
May 6, 2024 21: 04 PM
Slider చిత్తూరు

ఫైర్ బ్రాండ్ రోజాకు సొంతింట్లోనే కుంపటి

#roja

ఫైర్ బ్రాండ్ రోజా మంత్రి గా విధులు నిర్వర్తిస్తున్నా సొంత పార్టీ నేతల నుంచి టెన్షన్ తప్పడం లేదు. మళ్లీ చిత్తూరు జిల్లా నగరి వైసీపీ లో విభేదాలు తెరపైకి వచ్చాయి. సొంత పార్టీ నేతలే తనకు షాక్ ఇస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరి నియోజకవర్గంలోని కొప్పెడులో రైతు భరోసా కేంద్రానికి  రోజా వ్యతిరేక వర్గం భూమి పూజ చేసింది. ఈ కార్యక్రమానికి శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి హాజరయ్యారు.

అయితే ఇలా కార్యక్రమం చేపట్టడం తప్పుకాదని, అసలు స్థానిక ఎమ్మెల్యేగా, రాష్ట మంత్రిగా తనకు చెప్పకుండా కార్యక్రమం ఎలా చేపడతారు అంటూ మండిపడ్డారు. తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మానుకోవాలని కోరారు. ప్రతిపక్షంతో పోరాడాల్సిన తాను.. సొంత పార్టీ నేతలతో పోరాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా ఘటనపై మంత్రి రోజా సీరియస్ అయ్యారు.

సొంత పార్టీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వారి తీరుని తప్పుపట్టారు. అసలు తనను సంప్రదించకుండా భూమిపూజ చేయడం ఏంటని రోజా నిలదీస్తున్నారు. అలాగే పార్టీ వాట్సాప్ గ్రూప్ లో తన వ్యతిరేక వర్గం తీరుని తప్పుపడుతూ ఓ ఆడియో విడుదల చేశారు మంత్రి రోజా. నియోజకవర్గంలో తనను వీక్ చేసే విధంగా వ్యతిరేక వర్గం పని చేస్తోందని.. ఇలా అయితే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదరువ్వవా అని ఆమె ఫైర్ అయ్యారు. మంత్రి రోజా ఆవేదనను మరి అధిష్టానం ఎలా అర్థం చేసుకుంటుంది.. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తారా..? ఆమె అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారా అన్నది చూడాలి.

మంత్రి అయిన తనను నియోజకవర్గంలో బలహీన పరిచే విధంగా.. తెలుగుదేశం , జనసేన వాళ్లు నవ్వుకునే విధంగా, ఆ పార్టీలకు సపోర్ట్ అవుతూ తనకు, మన పార్టీకి నష్టం జరిగే విధంగా, పార్టీ దిగజారుస్తూ వీళ్లు భూమి పూజ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటూ ఆమె తన ఆవేదనను బయట పెట్టారు. ఇప్పటికైనా మీరంతా ఆలోచించాలి. ఇలాంటి వాళ్లు కంటిన్యూ అయితే, తాన లాంటివారు రాజకీయాలు చేయడం చాలా కష్టమవుతుంది అన్నారు. తాము ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పని చేస్తుంటే ప్రతి రోజూ మెంటల్ టెన్షన్ పెడుతూ, అన్ని రకాలుగా మాకు, పార్టీకి నష్టం జరుగుతుంటే, వీళ్లు పార్టీ నాయకులు అని చెప్పి ప్రోత్సహించడం కూడా చాలా బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

చిరుత దాడిలో గాయపడిన చిన్నారిని శ్రీవారే రక్షించారు

Bhavani

స్ప్రెడ్ ఇన్: దుబాయిలో భారత నర్సుకు కరోనా వైరస్

Satyam NEWS

కోవాక్సిన్ కన్నా సమర్ధంగా పని చేస్తున్న కోవి షీల్డ్ వ్యాక్సిన్

Satyam NEWS

Leave a Comment