సౌదీ అరేబియాలోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న కేరళకు చెందిన ఒక నర్సుకు కరోనా వైరస్ వ్యాధి సంక్రమించింది అక్కడి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.ఆమె రక్తం శాంపిల్ ను పరీక్షించినప్పుడు పాజిటివ్‌గా రిసల్ట్ రావడం తో ఆమెను , ఆమెతో పాటు పనిచేసిన మరో ముగ్గురు నర్సులను కూడా ఆబ్సెర్వేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్య బృందాలు తెలిపాయి.
అయితే ఈ వ్యాధి సోకిన ఫిలిప్పీన్స్ నర్సుకు వైద్యం అందించినప్పుడు ఆమెకు ఈ వైరస్ సోకినట్టుగా భావిస్తున్నారు. కాగా ఈ వ్యాధి సోకడం ద్వారా ఇప్పటివరకు చైనాలో 17 మంది మృతి చెందారు.అమెరికా లో నలుగురు మృతి చెందినట్లు ఆయా ప్రభుత్వాలు అధికారికం గా ప్రకటించాయి.ఈ వ్యాధి ఇండియా కువ్యాప్తి చెందుతూనే వార్తలతో ప్రజలు బాయ భ్రాంతులకు గురౌతున్నారు.