42.2 C
Hyderabad
April 26, 2024 15: 52 PM
Slider జాతీయం

కోవాక్సిన్ కన్నా సమర్ధంగా పని చేస్తున్న కోవి షీల్డ్ వ్యాక్సిన్

#coronavaccine

కోవాక్సిన్ కన్నా కోవి షీల్డ్ సమర్ధవంతంగా పని చేస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. రెండు వాక్సిన్‌లు సమర్ధంగానే పని చేస్తున్నా కోవాక్సిన్ కన్నా కోవి షీల్డ్ మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్లు తేలింది.

దేశంలో తొలి దశలో ఆరోగ్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. అందులో డాక్టర్లు, నర్సులు కూడా ఉన్నారు.

కొందరికి కోవిషీల్డ్, మరికొందరికి కోవాక్సిన్ ఇచ్చారు. రెండు డోసులు పూర్తి అయిన తర్వాత ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది సమర్ధంగా పని చేస్తున్నదని ఒక పరిశీలన జరపగా కోవాక్సిన్ కన్నా కోవి షీల్డ్ ఎక్కువ యాంటీ బాడీలను ఉత్పత్తి చేసినట్లు వెల్లడి అయింది.

మొత్తం 515 మంది ఆరోగ్య సిబ్బందిపై ఈ పరిశీలన జరిపారు. వారిలో 305 మంది మగవారు, 210 మంది ఆడవారు ఉన్నారు. కోవి షీల్డ్, కోవాక్సిన్ లు వీరికి అందుబాటును బట్టి రెండు డోసులు ఇచ్చారు. అలా వ్యాక్సిన్ తీసుకున్న ఈ 515 మందిలో కూడా 95 శాతం మేరకు సీరోపాజిటివిటీ (ఎక్కువ యాంటీబాడీలు) ఉన్నట్లు కనుగొన్నారు.

వీరిలో 425 మంది కోవి షీల్డ్ తీసుకున్నారు. వారిలో 98.1 శాతం యాంటీ బాడీలు ఉత్పత్తి అయ్యాయి. మరింత వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగితే దేశంలో మూడో దశ కరోనా వేవ్ ను అడ్డుకోవడానికి వీలుంటుందని కూడా పరిశీలనలో వెల్లడి అయింది.

ఇప్పటి వరకూ 60 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నవారిలో  43 శాతం మందికి ఒక డోసు కరోనా వ్యాక్సిన్ లభించింది. అయితే రెండు రాష్ట్రాలలో అతి తక్కువ మందికి మాత్రమే కరోనా వ్యాక్సిన్ లభించింది.

పంజాబ్ లో కేవలం 35 శాతం మందికి మాత్రమే వాక్సిన్ దొరికింది. తెలంగాణ రాష్ట్రంలో 60 సంవత్సరాలకన్నా ఎక్కువ వయసు ఉన్న వారిలో కేవలం 39 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ దొరికింది.

ఈ రెండు రాష్ట్రాలు అతి తక్కువ వ్యాక్సిన్ ఇచ్చిన రాష్ట్రాలు కాగా హిమాచల్ ప్రదేశ్ లో 78 శాతం మంది 60 ప్లస్ వారికి, త్రిపురలో 80 శాతం మంది 60 ప్లస్ వారికి వ్యాక్సిన్ ఇచ్చి అగ్రస్థానంలో నిలిచాయి.  

Related posts

జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతాం

Satyam NEWS

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయాలి

Satyam NEWS

ప్రధాని మోడీతో భేటీకి కదలిన రాజధాని రైతులు

Satyam NEWS

Leave a Comment