34.2 C
Hyderabad
May 11, 2024 19: 52 PM
Slider నెల్లూరు

వి ఎస్ యూ లో సర్ రోనాల్డ్ ఐల్మెర్ ఫిషర్ 132వ జయంతి

#vikramsimhapuriuniversity

సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఆచార్య సర్ రోనాల్డ్ ఐల్మెర్ ఫిషర్ 132వ జయంతి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాగణంలో శ్రీ పొట్టి శ్రీరాముల భవన్ లో నేడు ఘనంగా జరిగింది. జయంతి సందర్భంగా ఇక్కడి స్టాటిస్టిక్స్ విభాగంలో సర్ రోనాల్డ్ ఐల్మెర్ ఫిషర్ వారి చిత్రపటానికి ఉపకులపతి ఆచార్య జియం. సుందరవల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ గణిత శాస్త్రజ్ఞుడు, గణాంకవేత్త, జన్యు శాస్త్రవేత్త, విద్యావేత్తగా చురుకుగా పనిచేసిన బ్రిటీష్ పాలిమత్, జీవశాస్త్రవేత్త. గణాంకాలలో అతని పనికి,అతను “ఆధునిక గణాంక శాస్త్రానికి పునాదులను దాదాపు ఒంటరిగా సృష్టించిన మేధావి”, “20వ శతాబ్దపు గణాంకాలలో అతి ముఖ్యమైన వ్యక్తి” అని వర్ణించబడ్డాడు.

ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎం .చంద్రయ్య, రిజిస్ట్రార్ డా ఎల్ విజయ కృష్ణా రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ సుజా ఎస్ నాయర్, స్టాటిస్టిక్స్ విభాగ అధిపతి డా టి.వీరా రెడ్డి,డా సిహెచ్. విజయ, ఆర్ వి ఎస్ ఎస్ నాగభూషణ రావు, ప్రసూన, తస్లీమా,అహ్మద్ బాష విద్యార్థిని విద్యార్థులు, బోధన బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ వేద విద్వన్మహా సభ ప్రారంభం: వేద ధర్మ ప‌రిరక్షణకు కృషి

Satyam NEWS

ఇడుపులపాయకు చేరిన ముఖ్యమంత్రి జగన్

Satyam NEWS

కాశ్మీర్ లోయలో ఎయిర్ షో.. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు

Sub Editor

Leave a Comment