29.7 C
Hyderabad
May 6, 2024 03: 47 AM
Slider గుంటూరు

కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో రోప్ వే పనుల విస్తరణ

#kotappakonda

గుంటూరు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన కోటప్ప కొండపై రోప్ వే పనుల విస్తరణ కార్యక్రమాన్ని చేపడతామని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం కింద నుంచి త్రికోటేశ్వరస్వామి సన్నిధి వరకు రోప్ వే ఉంది. అయితే సన్నిధి నుంచి పాతకోటయ్య స్వామి దేవాలయం వరకు ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కువ మంది స్వామి వారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

పాత కోటయ్య స్వామిని దర్శించుకోవాలనేది చాలా మంది భక్తుల ఆకాంక్ష.. ఆ కోరికను తీర్చడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. నాలుగైదు నెలల్లో త్రికోటేశ్వర స్వామి సన్నిధి నుంచి పాత కోటయ్య స్వామి సన్నిధికి రోప్ వే పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదిన జరగనున్న శ్రీ తికోటేశ్వర స్వామి తిరుణాళ్లను పురస్కరించుకుని జరుగుతున్న పనులను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ వర ప్రసాద రెడ్డి, డీఎస్పీ పరిశీలించారు. మెట్ల మార్గంలో ఉన్న పార్క్ తో పాటు, కొలనును పరిశీలించారు. అక్కడ బోటింగ్ ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలతో పాటు.. సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. కొండపైకి చేరుకుని నంది విగ్రహం, డార్మెటరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ముఖ్య అతిథులకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. త్రికోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం టూరిజం కార్పొరేషన్ చైర్మన్ వరప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కోరిక మేరకు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు కొండ దిగువన ఉన్న రెండు ఎకరాల్లో నిరూపయోగంగా ఉన్న పార్క్ తో పాటు, లేక్ ను బాగుచేయాలని, భక్తుల సౌకర్యార్ధం రోప్ వే మంజురైన అనుకోని కారణాల వల్ల వాయిదా పడిందన్నారు. తాను చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనప్పటి నుంచి కోటప్పకోండ  అభివృద్ధిపై ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నానని తెలిపారు.ఈ

కార్యక్రమంలో ఎంపీపీ మూరబోయిన శ్రీనివాసరావు, జెడ్పీటీసీ చిట్టిబాబు,  ఎమ్మార్వో రమణా నాయక్, ఆలయ ఈవో అన్నపరెడ్డి రామకోటిరెడ్డి, కొండ కావురు సర్పంచ్ నాగిరెడ్డి, మూరే రవీంద్రా రెడ్డి, కనకా పుల్లా రెడ్డి, సానికొమ్ము కోటిరెడ్డి, జాన్, మైనార్టీ నాయకులు ఖాదర్ బాషా, మట్ల లింగారెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts

Hats off: మీలాంటి వారే ఈ సమాజానికి కావాలి టీచర్

Satyam NEWS

New year special: తాగి వాహనాలు నడిపితే తాటతీస్తాం

Satyam NEWS

ఆఫ్ఘనిస్థాన్ లో మైనారిటీల హక్కులను పరిరక్షించాలి

Satyam NEWS

Leave a Comment