27.7 C
Hyderabad
May 4, 2024 08: 55 AM
Slider ప్రపంచం

గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు రష్యా భారీ జరిమానా

స్థానిక చట్టం ద్వారా పరిమితం చేయబడిన కంటెంట్‌ను తీసివేయడంలో విఫలమైనందుకు రష్యా రాజధాని మాస్కో కోర్టు గూగుల్‌కు, ఫేస్‌బుక్‌లకు దాదాపు 130 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాకు కూడా కోర్టు 27.2 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.

మాస్కో కోర్టు గూగుల్‌కు 7.2 బిలియన్ రూబిళ్లు జరిమానా విధించింది. మాస్కోలోని టాగన్‌స్కీ జిల్లా కోర్టు నిబంధనలకు విరుద్దంగా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని చెబుతున్నా గూగుల్‌ విస్మరించింది. గూగుల్‌కు దాదాపు 7.2 బిలియన్ రూబిళ్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

అలాగే టాగన్‌స్కీ జిల్లా కోర్టు నిర్ణయంపై గూగుల్ స్పందించింది. కోర్టు ఆదేశాలను అధ్యయనం చేసి, తదుపరి అంశాలపై నిర్ణయం తీసుకుంటామని గూగుల్ తెలిపింది. ఇక ఫేస్‌బుక్‌కు కూడా జరిమానా విధించింది కోర్టు. నిషేధిత కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు కోర్టు మెటాకి 1.9 బిలియన్ రూబిళ్లు జరిమానా విధించింది.

Related posts

ఆక్రమణదారులకు అధికారులు వత్తాసుపలికితే ఏం చేయాలి???

Satyam NEWS

క్లిక్ & కలెక్ట్’ సేవలను ప్రారంభించిన హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ (HDF)

Satyam NEWS

చిన్న చిన్న సమస్యలకు పోలీస్ స్టేషన్లకు రావద్దు

Satyam NEWS

Leave a Comment