42.2 C
Hyderabad
April 26, 2024 15: 12 PM
Slider ఖమ్మం

ఖమ్మంలో ప్రాపర్టీ షో లాంఛనంగా ప్రారంభించిన మంత్రి పువ్వాడ

#ministerpuvvada

రియల్ వ్యాపార రంగం హైదరాబాద్ నగరం తరువాత అంతటి వ్యాపారం ఖమ్మం నగరంలో బాగా కొనసాగుతున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. Sr&bgnr కళాశాల మైదానంలో CREDAI ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో ను మంత్రి పువ్వాడ లాంఛనంగా ప్రారంభించారు.

ఖమ్మం నగరం అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రత్యేకతను దక్కించుకుందన్నారు. నగరం చుట్టూ భూములు బంగారు సిరులు ఒలికించే భూములయ్యాయని ప్రతి ఒక్కరి కల ఒక మంచి ఇంటిని నిర్మించుకోవడం చిరకాల స్వప్నం అని అన్నారు.

డబ్బు అశాశ్వతం.. నమ్మకం శాశ్వతం. పేరు వచ్చేలా, కొనుగోలుదారుల నమ్మకం పొందేలా నిర్మాణాలు ఉండాలని CREDAI బృందానికి సూచించారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా, ప్రపంచ మార్పులకు అనుగుణంగా నిర్మాణాలు రూపొందించాలని కోరారు.

తెలంగాణ అభివృద్ధి లాగే క్రెడాయ్‌ వృద్ది కొనసాగుతుందని అన్నారు.. డబుల్ వేగంతో అభివృద్ధి జరుగుతున్నదని అన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఇతర దేశాల నుండి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారంటే అది తెలంగాణ ప్రభుత్వం అన్ని వసతులు, సౌకర్యాలతో అందిస్తున్న ప్రోత్సాహమే కారణమన్నారు.

శాంతి భద్రతలు, మంచి నాయకత్వం, మంచి వాతావరణం, రాజకీయ స్థిరత, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అద్భుత విధానాలు తెలంగాణ వృద్ధికి కారణంగా నిలుస్తున్నాయన్నారు.వివిధ జిల్లాలకు చెందిన వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యాక ఖమ్మంలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.

గత రెండేళ్లుగా పరిశ్రమ రంగాలు కష్ట కాలంఎదుర్కొటున్నాయని, అయినప్పటికీ ప్రభుత్వం ఛాలెంజ్ సమయంలో కూడా రియల్ ఎస్టేట్ రంగం దేశంలోనే అగ్ర స్థానంలో కొనసాగిందన్నారు. ముఖ్యమత్రి కేసీఆర్ నాయకత్వం, ప్రభుత్వ విధానాలు.. పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తున్నయని వివరించారు.

గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణ ప్రాంతంలో తొండలు గుడ్లు పెట్టని ప్రాంతం అని ఓ పెద్ద నాయకుడు ఎద్దేవా చేశారని, ఈసడింపులు ఎదుర్కొని, నిలబడ్డ ఉద్యమ గడ్డ తెలంగాణ మాత్రమే అన్నారు. నిజంగానే తెలంగాణ అభివృద్ధిలో వెనకవేయబడ్డ ప్రాంతం. పాలకుల నిర్లక్ష్యం, పక్షపాత ధోరణి ఈ ప్రాంతానికి శాపంగా మారినప్పటికి అన్నిటినీ అధిగమించి నేడు రియల్ వ్యాపారరంగంలో తెలంగాణ ది బెస్ట్ గా నిలిచిందన్నారు.

తెలంగాణ వచ్చాక పరిస్థితి మారింది. బీడు భూములు పచ్చబడ్డాయి. పల్లెలకు పచ్చని రంగేసినట్లు మారాయి. తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందని,  ఇక్కడి భూముల ధరలు పడిపోతాయని కొద్ది మంది ఆనాడు జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం బాగా ఉండాలని అందరూ దీవెనలు ఇవ్వాలి..ఇంకా ఎంతో అభివృద్ధి జరుగుతుంది అని ఆయన అన్నారు.

ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, AMC చైర్మన్ ప్రసన్న లక్ష్మీ, మున్సిపల్ కమీషనర్ ఆదర్శ సురభి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

నేటి నుండి తెలుగుదేశం పండుగ

Satyam NEWS

వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని ప్రారంభించిన శాసనసభ్యుడు శానంపూడి

Satyam NEWS

తెలుగు వదిలేస్తే తల్లిని వదిలేసినట్లే

Satyam NEWS

Leave a Comment