31.2 C
Hyderabad
May 3, 2024 00: 10 AM
Slider ముఖ్యంశాలు

క్లిక్ & కలెక్ట్’ సేవలను ప్రారంభించిన హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ (HDF)

#Click and Collect

GMR హాస్పిటాలిటీ అండ్ రిటైల్ లిమిటెడ్ లో ఒక భాగమైన హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ (HDF), రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లో డ్యూటీ ఫ్రీ షాపులను నిర్వహిస్తుంది.

ఇటీవల HDF ఆన్‌లైన్ “క్లిక్ & కలెక్ట్” సదుపాయాన్ని ప్రారంభించింది. దీని వల్ల హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు (రాక, పోకల అంతర్జాతీయ ప్రయాణికులు) తమకు కావాల్సిన ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ముందుగానే బుక్ చేసుకుని, తమ వెంట తీసుకువెళ్లవచ్చు.

కోవిడ్ వ్యాప్తి చెందుతున్న ఈ రోజుల్లో, ఈ ఆన్‌లైన్ వేదిక అంతర్జాతీయ ప్రయాణికులు డ్యూటీ-ఫ్రీ ఉత్పత్తులను “సులభంగా మరియు సురక్షితంగా” కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది.

ఈ సదుపాయాన్ని పొందాలనుకునే ప్రయాణీకులు మొదట హెచ్‌డిఎఫ్ వెబ్‌సైట్ www.hyderabaddutyfree.com లో నమోదు చేసుకోవాలి. అక్కడ వారి ప్రయాణ, పాస్‌పోర్ట్ వివరాలను పొందుపరచాలి.

దీని తరువాత, వారు HDF వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులను ఎంపిక చేసుకోవచ్చు. వారు ప్రయాణించడానికి ముందే  తమ ఆర్డర్‌ను పెట్టవచ్చు, దీనితో వారికి ఆర్డర్ వివరాలతో పాటు రశీదు ఇవ్వబడుతుంది.

Related posts

ఛా ఛా ఇదేం కోవిడ్ కేర్ సెంటర్?

Satyam NEWS

జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి

Satyam NEWS

బాబుతో ఫొటోనే మిగిలింది వై ఎస్ తో అందలం దక్కింది

Satyam NEWS

Leave a Comment