27.7 C
Hyderabad
May 15, 2024 06: 43 AM
Slider కడప

నవంబర్ లో  రైతు సంఘం రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు

#apraitusangham

నవంబర్ 8 9 10 తేదీలలో వ్యవసాయ సంక్షోభం పరిష్కారం మార్గాలు అనే అంశంపై రాష్ట్రస్థాయి రైతులకు శిక్షణ తరగతులు కడప నగరంలో నిర్వహిస్తున్నట్లు ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం రైతు సంఘం జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయ రంగం రోజురోజుకు సంక్షోభంలోకి కూరుకుపోతున్నదని రైతాంగ పరిస్థితి క్షీణిస్తున్నదని స్వామినాథన్ కమిషన్ సూచనల ప్రకారం మద్దతు ధరలు చట్టం తీసుకురావడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆయన తెలిపారు.

వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ శక్తులకు అప్పగించేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం  మూడు నల్ల చట్టాలను తెచ్చిందని దీనికి వ్యతిరేకంగా దేశంలో 540 రైతు సంఘాలు ఐక్యమై సంవత్సరం పాటు సాగిన ఉద్యమానికి తలవగ్గిన బిజెపి ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నదని ఆయన తెలిపారు. పంటలకు ఉత్పత్తి ఖర్చులు బాగా పెరిగిపోయాయని గిట్టుబాటు ధర దక్కడం లేదని సబ్సిడీలలో కోత విధించారని ఎరువులు విత్తనాలు పురుగుమందుల ధరలు అమాంతం పెరిగిపోయాయని కల్తీ విత్తనాలు రైతులను నిలువునా మంచుతున్నాయని విద్యుత్ కోతలు వ్యవసాయని తీవ్రంగా నష్టపరుస్తున్నాయని ఆయన తెలిపారు.

రైతులను రక్షించుకుందాం వ్యవసాయాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో వ్యవసాయ సంక్షోభం నుండి ఎలా బయటపడాలో చర్చించి పరిష్కార మార్గాలు  కోసం నవంబర్ 8 9 10 తేదీలలో రైతు సంఘం రాష్ట్రస్థాయి ముఖ్య రైతులకు శిక్షణ తరగతులు కడప నగరంలో నిర్వహిస్తున్నట్లు  జిల్లా ప్రజానీకం సహకరించి సహాయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి పాల్గొన్నారు.

Related posts

కరోనా 3వ దశకు సూర్యాపేట ఎలా వచ్చిందంటే?

Satyam NEWS

కరోనాను జయించిన ములుగు యువకుడు

Satyam NEWS

మొబైల్ నుంచి ఆర్ధిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం

Satyam NEWS

Leave a Comment