40.2 C
Hyderabad
April 29, 2024 15: 49 PM
Slider అనంతపురం

రాయదుర్గంలో హోరేత్తిన వాల్మీకుల నిరసన 

#valmiki

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని మాట తప్పిన జగన్ ప్రభుత్వం

అనంత పురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వాల్మీకి , బోయల ఎస్టీ పునరుద్ధరణ జాబితా పునరుద్ధరణపై  ప్రభుత్వం వెంటనే స్పందించాలని వాల్మీకుల నిరసన కార్యక్రమం హోరేత్తింది. ఆదివారం వాల్మీకి జయంతిని పురస్కరించుకుని రాయదుర్గం పట్టణం వాల్మీకి సోదరులతో జనసంద్రమైంది.

రాయదుర్గం నియోజకవర్గం వాల్మీకి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు నాయకుల బండి క్రిష్టప్ప ఆధ్వర్యంలో ఆ సంక్షేమ సేవా సమితి ఉపాధ్యక్షులు మలకన్న, ప్రధాన కార్యదర్శి  ఎన్.టి.సిద్దప్ప లతో కలిసి అధ్యక్షుల వారి స్వగృహం నుండి చేపట్టిన  బైక్ ర్యాలీ లక్ష్మీ బజార్ మీదుగా కోట లో మారమ్మ దేవాలయం వద్ద వెలసిన వాల్మీకి కళ్యాణ మండపంకు చేరుకుంది. నియోజకవర్గంలోని  ఐదు మండలాల నుంచి తరలివచ్చిన  వాల్మీకి సోదరులతో కలిసి వాల్మీకి  కళ్యాణ మండపంలో  వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించి తిరిగి బైక్ ర్యాలీతో అంబేద్కర్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు.

అనంతరం వాల్మీకి సర్కిల్ నందు వాల్మీకి, బోయల ఎస్టీ జాబితా  పునరుద్ధరణ చేయాలని అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో వాల్మీకి సోదరులు  నల్ల బ్యాడ్జీలతో మౌన హారం చేపట్టి ప్రభుత్వం ఎస్టీ  జాబితా  పునరుద్ధరించాలని ప్రసంగించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఇప్పటిదాకా అన్ని రాజకీయ పార్టీలు వాల్మీకుల ఓట్లతో పబ్బం గడుపుకుంటున్నారని ఎస్టీ పునరుద్ధరణ సాధనే దెయంగా వాల్మీకి సోదరులు రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు.

అన్ని విధాలుగా మోసపోయిన వాల్మీకులు

వాల్మీకులు కష్ట జీవులుగా జీవనం సాగిస్తున్నారని వాల్మీకులు అన్ని రంగాలలో నిరాశ్రయులుగా మిగిలారని ఈ విషయం ఆయా రాజకీయ పార్టీలకు తెలిసినప్పటికీ వాల్మీకులను అనగా తొక్కుతున్నారని ఆయన ఆవేదన, వ్యక్తపరిచారు, అక్కడనుండి శాంతినగర్ లో ఉన్న భక్తకన్నప్ప విగ్రహం వద్దకు చేరుకుని భక్తకన్నప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి లక్ష్మి బజార్ మీదుగా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని, రోగులకు బ్రెడ్డు పండ్లు పంపిణీ చేశారు చేశారు.  ఐదు మండలాల వాల్మీకి ముఖ్య నాయకులు మాట్లాడుతూ మాకు కావాల్సింది పదవులు కాదు రాజ్యాంగం కల్పించిన హక్కు ఎస్టీ పునరుద్ధరణ కల్పించి, మా అణగారిన వర్గాల, వాల్మీకి బోయల సమస్యను ప్రభుత్వం వెంటనే, స్పందించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మాకు ఎస్టీ పునరుద్ధరణ కల్పించాలని డిమాండ్ చేశారు,

ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన  మైన పోరాటాలు చేసి ప్రభుత్వం చేస్తున్న మోసాలని ఎండగడతామని ఈ సభ ముఖంగా డిమాండ్ చేశారు. మా ఓట్లతో గద్దెనెక్కిన రాజకీయ నాయకులకు మేము ఒకటే సవాల్ విసురుతున్నాం. మా ఓట్లతో మీరు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నారు. మీరు మమ్మల్ని మర్చిపోతే రాబోయే రోజుల్లో మేము మిమ్మల్ని మర్చిపోవాల్సి వస్తుంది, అని తెలియజేశారు, పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో మా వాల్మీకి కుటుంబ సభ్యులు 3% రిజర్వేషన్ నుండి 7% రిజర్వేషన్ నీ  కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి తర్వాత  ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు  చేసి రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి బోయలకు రిజర్వేషన్ కల్పించింది,

భారతదేశంలో ఇలాంటి రాజ్యాంగం ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది మేము ఏమి పాపం చేసి ఉంటే వాల్మీకి బోయలుగా  ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎందుకు పుట్టామా  అని ఆవేదనను వ్యక్తపరిచారు. సమస్యను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుంటే రాబోయే ఎలక్షన్లో ఈ రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని ఈ సభ ముఖంగా 5 మండలాల వాల్మీకి కుటుంబ సభ్యులు తెలియజేశారు,

Related posts

విశాఖలో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం

Bhavani

NH167/A రహదారి మార్గాన్ని మార్చాలి

Bhavani

సైరా నరసింహారెడ్డి చిత్రం రివ్యూ

Satyam NEWS

Leave a Comment