37.2 C
Hyderabad
April 26, 2024 21: 16 PM
Slider సంపాదకీయం

కరోనా 3వ దశకు సూర్యాపేట ఎలా వచ్చిందంటే?

suryapet

ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కు హాజరై వచ్చిన ఒక్క వ్యక్తి వల్ల ఇప్పుడు సూర్యాపేట కరోనా ప్లే గ్రౌండ్ గా మారింది. కరోనా అక్కడ చెడుగుడు ఆడుకుంటున్నది. ఈ నెల 2న సూర్యాపేటలో మొదటి కేసు నమోదు కాగా కేవలం 20 రోజుల పరిధిలోని 80 కేసులకు చేరింది.

కరోనా పాజిటీవ్‌గా తేలిన వారికి కాంట్రాక్ట్‌లో ఉన్న వారు సుమారు 5 వేల మంది ఉన్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదకర స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా గుర్తించిన వారిలో 4,346 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. మరో 210 మందిని ప్రభుత్వ క్వారంటైన్‌లో పెట్టారు.

మొత్తం 796 నమూనాలను సేకరించగా 80 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. మరో 191 పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ఢిల్లీ మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన ఒకే ఒక్క వ్యక్తి వల్ల ఇంత దారుణం జరిగిందని ఎవరూ బాహాటంగా చెప్పరు. అలా చెబితే కదా మిగిలిన వారు జాగ్రత్త పడేది?

అయినా మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి కారణంగా కరోనా వ్యాపించింది అంటే ముస్లింలు బాధపడతారేమోనని అందరూ దాచి పెడతారు. ఇది మతానికి సంబంధించిన విషయం కాదని ఆరోగ్యానికి సంబంధించిన విషయమని అందరికి తెలుసు కానీ ఎవరూ మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి వల్లే ఇంత జరిగిందని చెప్పకపోవడం వల్ల నష్టం మరింత పెరిగింది.

అసలు విషయం ఏమిటంటే తబ్లిగీ జమాత్ వెళ్లి వచ్చిన ఆ ఒకే ఒక్క వ్యక్తి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ విషయం దాచి పెట్టాడు. తన కుటుంబ సభ్యులకు ఏదో మంది కావాలంటే మెడికల్ షాపు కు వెళ్లాడు. అక్కడ మందులు కొని డబ్బులు ఇచ్చాడు.

దాంతో ఆ మెడికల్ షాపులో పని చేస్తున్న వారికి కరోనా వైరస్ వ్యాపించింది. అదే మెడికల్ షాపులో ఒక మహిళ మందులు కొనుగోలు చేసింది. ఆమె వృత్తి చేపలు అమ్మడం. మార్కెట్ లో చేపలు అమ్మిన ఆమె ఎంతో మందికి కరోనా వైరస్ ను ఎక్కించింది. ఇవన్నీ తెలియక జరిగినవే అయినా భారీ మూల్యం చల్లిస్తున్నది సూర్యాపేట.

చేపల దుకాణం మహిళ ద్వారా పక్కనే ఉన్న ఒక కిరాణా షాపు నిర్వాహకుడికి వైరస్ అంటింది. అతడి నుంచి మరి కొందరికి వైరస్ సోకింది. ఈ మొత్తం కాంటాక్ట్‌లను చేధించడమే ఇప్పుడు అధికార యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారింది. చాలా రోజులు చిక్కుముడిగా ఉన్న ఈ కాంటాక్ట్ ట్రేసింగ్‌ను చివరకు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా అధికారులు గుర్తించారు.

ప్రమాదకరస్థాయిలో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం సూర్యాపేటపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సూర్యాపేట మున్సిపాలిటీకి కరోనా ప్రత్యేక అధికారిగా వేణుగోపాల్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన మెడికల్ షాపులో ఎవరెవరు మందులు కొన్నారనే వివరాలను సేకరించి, వారిని క్వారంటైన్‌లో పెడుతున్నారు. 

కేవలం మార్కెట్ ప్రాంతంలోనే 40 మందికి కరోనా సోకడంతో ఈ మార్కెట్‌కు వచ్చే నాలుగు మండలాల్లోని సుమారు 40 గ్రామాల్లో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో, ప్రత్యేకించి సూర్యాపేట పట్టణంలో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. కరోనాను తేలిగ్గా తీసుకుంటున్న వారికి సూర్యాపేటలో ఒక్కరి నుంచి నమోదవుతున్న కేసులు ఒక హెచ్చరిక లాంటివి. అందుకే లాక్‌డౌన్‌ను సరిగ్గా పాటించి అందరూ ఇళ్లకే పరిమితం అవడం మంచిది.

Related posts

పేదింటి పెళ్ళికి భోజన సదుపాయం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

కార్మిక చట్ట సవరణలను విరమించుకోకపోతే ఉద్యమం ఉధృతం

Satyam NEWS

రాజకీయ నాయకుల్లా కొట్లాడుకుంటున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment