Slider విశాఖపట్నం

విశాఖ ఆసుపత్రులపై గగనం నుంచి కురిసిన పూలు

#CoronaFlowersVizag

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న నోళ్లే ఇప్పుడు సర్కారీ  వైద్యులే భేష్‌ అంటూ కితాబిస్తున్నాయి. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులను వినూత్నంగా సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా  త్రివిధ దళాలు దిల్లీ, హైదరాబాద్‌, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరుతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న కొవిడ్‌ ఆసుపత్రులపై హెలీకాప్టర్లతో పూలవర్షం కురిపించాయి.

విశాఖ నగరంలోని ఛాతి, అంటువ్యాధుల ఆసుపత్రి, గీతం ఆసుపత్రులపై వాయుసేన సిబ్బంది హెలీకాప్టర్‌తో ఆదివారం ఉదయం పూలజల్లు కురిపించారు. రక్షణ దళాల అధికారులు ఈ సందర్భంగా వైద్యులను సత్కరించారు.

Related posts

రైతుల భూమిలో రైతు వేదిక నిర్మాణం ఆపాలి

Satyam NEWS

సిర్పూర్ సమస్యల పరిష్కారానికి బండి సంజయ్ హామీ

Satyam NEWS

విఆర్ఎ లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Satyam NEWS

Leave a Comment