Slider సినిమా

మూడు భాషల్లో సోనీ చరిష్ట కొత్త ‘కాంట్రాక్ట్’

#SonyCherista

మూడు భాషల్లో రాబోతున్న తన కొత్త చిత్రం కాంట్రాక్ట్ ప్రేక్షకులను అలరిస్తుందని సోనీ చరిష్ట నమ్మకంగా ఉంది. యాక్షన్ కింగ్ అర్జున్ తో కలిసి నటిస్తున్న కాంటాక్ట్ చిత్రం తెలుగు కన్నడ భాషల్లో త్వరలో విడుదల కాబోతున్నది. తమిళంలో ‘ఇరువర్ ఒప్పందం’ పేరుతో ఇదే చిత్రం విడుదల అవుతున్నది.

ఈ చిత్రంలో జెడి చక్రవర్తి, రాధికా కుమారస్వామి, అమీర్ ఖాన్ సోదరుడు ఫైసల్ ఖాన్ తదితరులు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరిని అలరిస్తుందని సోనీ చరిష్ట నమ్మకంగా చెప్పింది. యాక్షన్ కింగ్ అర్జున్ ఒక గొప్ప నటుడే కాదు మంచి మానవత్వం ఉన్న మనిషి అని సోని చెప్పింది.

ఆయన నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని సోని అంటున్నది. రాధికా కుమార స్వామితో కలిసి నటించడం కొత్త అనుభూతిని మిగుల్చిందని సోని చెబుతున్నది. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి భార్య అయినా కూడా ఎంతో సాధారణంగా ఉండే రాధికను తాను గొప్పగా ఆరాధిస్తున్నానని సోని చరిష్ట చెప్పింది.

చిత్రం షూటింగ్ సమయంలో ఆమె నుంచి తాను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని సోని చరిష్ట చెబుతున్నది. తనకు మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎస్ ఎస్ సమీర్ కు ఆమె ధన్యవాదాలు తెలిపింది. మంచి పేరున్న నటీనటులతో కలిసి నటించేందుకు తన కు అవకాశం ఇవ్వడం అదృష్టమని ఆమె తెలిపింది. ఈ చిత్రం అఖండ విజయం సాధించి సినీ పరిశ్రమలో తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని సోని చరిష్ట ఆశిస్తున్నది.

Related posts

హక్కుల కమిషన్ కు వచ్చే బాధితుల సమస్యలు సత్వర పరిష్కారం

Satyam NEWS

క‌ర్త‌వ్య దీక్ష‌లో ఆమె దిట్ట‌..విదుల నిర్వ‌హ‌ణ‌లో “తగ్గేదేలే”….!

Satyam NEWS

ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ అండ

mamatha

Leave a Comment