29.7 C
Hyderabad
April 29, 2024 10: 18 AM
Slider ముఖ్యంశాలు

మీ ఇంట్లో పెళ్లా? ఈ రూల్సు పాటించండి

#Marriage Function

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా పెళ్లిళ్ల అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఇప్పటివరకు జిల్లా కలెక్టరేట్‌ల నుంచి పెళ్లిళ్లకు అనుమతి పొందాల్సి వచ్చేది. అలా సింగిల్ విడో పర్మిషన్ల కారణంగా ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో మండల పరిధిలోని స్థానిక తహసీల్డార్లకు ఈ బాధ్యతలను అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది.

21వ తేదీ నుంచి శ్రావణ మాసం మొదలు అవుతుండటంతో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని, మరే ఇతర ఫంక్షన్లకు అనుమతి ఇచ్చేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. వధువు- వరుడు తరపున 20 మంది మాత్రమే హాజరు కావాలని ప్రభుత్వం పేర్కొంది.

ఇక పెళ్ళికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేవారు వివాహానికి హాజరయ్యే 20 మంది వివరాలతో పాటు పెళ్లి పత్రిక, ఆధార్ కార్డు, కరోనా రిపోర్టులతో పాటు రూ. 10 నాన్ జ్యుడీషియల్ స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్డార్‌కు సమర్పించాల్సి ఉంది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం తీసుకుంటారు.

Related posts

ఫోన్‌ట్యాపింగ్‌ చేసే అవసరం ప్రభుత్వానికి లేదు

Satyam NEWS

జీహెచ్ఎంసీ స‌మ‌రానికి సై

Sub Editor

సింహవాహినీ మాతా పాహిమాం

Satyam NEWS

Leave a Comment