27.7 C
Hyderabad
May 11, 2024 09: 58 AM
Slider ముఖ్యంశాలు

నవంబర్‌ 26న సంయుక్త కిసాన్‌ మోర్చా ఛలో రాజ్‌భవన్‌

రైతు పోరాటానికి 2 ఏళ్ళు పూర్తి కావొస్తున్న సందర్భంగా సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా నవంబర్‌ 26న ‘ఛలో రాజ్‌ భవన్‌’ను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా తెలంగాణ కమిటీ యకులు పిలుపునిచ్చారు. శనివారం హైద్రాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఛలో రాజ్‌భవన్‌ పోస్టర్‌ను అఖిల భారత పోరాట సమన్వయ కమిటీ, సంయుక్త కిసాన్‌ మోర్చా రాష్ట్ర నాయకులు టి.సాగర్‌, పశ్య పద్మ, ఉపేందర్‌ రెడ్డి, మండల వెంకన్న,జక్కుల వెంకటయ్య, మూడ్‌ శోభన్‌, సోమిడి శ్రీను, వరికుప్పల వెంకన్న, పెద్దారపు రమేష్‌ తదితరులు

ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ… చారిత్రక రైతు పోరాటానికి 2 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్‌ 26న దేశవ్యాప్తంగా రాజ్‌భవన్‌లకు రైతాంగం పెద్దసంఖ్యలో చేరుకోవాలన్నారు. గవర్నర్లకు సమస్యలతో కూడిన మెమోరాండాలను అందిస్తామన్నారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రైతాంగానికి వ్రాతపూర్వకంగా హామీఇచ్చి అమలు చేయకపోవడం దారుణమన్నారు. రైతాంగం పండించిన పంటలకు కనీస మద్ధతు ధరలకై పార్లమెంటులో చట్టం చేయాలని, స్వామినాథన్‌ సిఫార్సుల ప్రకారం సీ2ం50 అమలు చేయాలని, రైతాంగానికి ఉన్న రుణాలన్నింటినీ

ఏకకాలంలో మాఫీ చేయాలని, రుణ విమోచన చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లును పసంహరించు కోవాలన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ భీమా యోజన పథకాన్ని సవరించి అమలు చేయాలని అన్నారు. రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని కోరారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర హౌంశాఖా సహాయమంత్రి అజరుకుమార్‌ మిశ్రాను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అటవీ సంరక్షణ చట్టం నిబంధనలలో కేంద్రం చేస్తున్న మార్పులను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.

Related posts

IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా గీతా గోపీనాథ్

Sub Editor

బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు

Satyam NEWS

విలేకరి మల్యాలను సత్కరించిన మంత్రి నిరంజన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment