39.2 C
Hyderabad
May 4, 2024 22: 31 PM
Slider పశ్చిమగోదావరి

జోరు వర్షంలో… సర్పంచ్ ల నిరసన

#Sarpanch

ఏలూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో సర్పంచులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సచివాలయం వాలంటీర్స్ వ్యవస్థలను పంచాయతీ లలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. కలక్టర్ బయటకు రావాలంటూ వర్షంలో బైఠాయించిన సర్పంచ్ లు నినాదాలు చేశారు. ఈ మేరకు సంఘ నేతలు డిఆర్వోకు వినతిపత్రం అందచేశారు.

ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సర్పంచ్ ల సంఘ అధ్యక్షుడు కడలి గోపాలరావు మాట్లాడుతూ
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దొంగలించిన నిధులు విధులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పంచాయతీ చాంబర్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కడలి గోపాలరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి సర్పంచులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కొట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి పంచాయతీలను అధ్వానంగా తయారు చేశారని, పారిశుధ్యం పడక వేసిందనన్నారు. పంచాయతీ సర్పంచ్లను ఉత్సవ విగ్రహాల తయారు చేయడమే కాకుండా 14, 15 ఆర్థిక సంఘం నిధులు 8660 కోట్లు రూపాయలు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి స్వాహా చేశారని ఆరోపించారు.

Related posts

కోవిడ్ నిబంధనల మేరకు ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణం

Satyam NEWS

డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

Murali Krishna

అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ ధ్యేయం

Satyam NEWS

Leave a Comment