27.7 C
Hyderabad
April 30, 2024 07: 19 AM
Slider ముఖ్యంశాలు

పార్లమెంటులో హోరెత్తిన మణిపూర్ మంటలు

#Manipur fires

మణిపూర్ మారణకాండపై కేంద్ర ప్రభుత్వం చర్చ జరపాలని బీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు. ఉభయ సభలు ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొన సాగింది. మణిపూర్ హింసపై చర్చ జరపాలనంటూ బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు రాజ్యసభలో, లోక్‌ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు లోక్‌సభలో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అయినా స్పీకర్లు పట్టించుకోకపోవడంతో ఎంపీలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.

దీంతో స్పీకర్ ఓంబిర్లా లోక్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం కాగానే ఎంపీలు మళ్లీ ఆందోళన కొన సాగించారు. మళ్లీ సభను స్పీకర్ 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు.

ఇప్పటికైనా కేంద్రం మొండివైఖరి వదిలి మణి పూర్‌లో శాంతి నెలకొల్పేందుకు తీసు కోవాల్సిన చర్యలపైన సమగ్ర చర్చ జరపాలని నామ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

Related posts

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కారు ధ్వంసం

Sub Editor

రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఓదార్చాలి

Satyam NEWS

హజ్బెండ్ అండ్ వైఫ్: నేరేడ్ మెంట్ ఎస్ ఐ అత్యుత్సాహం

Satyam NEWS

Leave a Comment