38.2 C
Hyderabad
May 3, 2024 22: 14 PM
కవి ప్రపంచం

విశ్వసనీయతా శిఖరం

#Madhusudanarao Vijaya Dairy

ఆర్ధికానికే అర్ధాలు నేర్పి

చాణక్య చతురతకు కొత్త భాష్యమిచ్చి

ఆధునిక దృష్టికోణానికి నిలువుటద్దమై

విశ్వ భాషలపై విజయకేతనమెగరేసి

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకునే అని

ఎదిగిన కొద్దీ ఒదిగిన

పరిణతమనస్వి తెలుగు యశస్వి

మన ఠీవి మన పీవీ

తొలిసారి చెరసాల శాఖలపై

స్వేచ్ఛాకపోతమై

అంచెలంచెలుగా ఆంధ్రకే

ఆలంబనయై

దేశానికే చుక్కానియై

గతి మార్చిన క్రాంతివదర్శి

సమైక్యతకు సమర్శి మన పీవి

మౌనంగా మాటల తూటాలు

ఇన్ సైడర్ గా అందరి మనసుల్లో

ఒదిగిన యాది

విశ్వవేదికపై విశ్వసనీయతా

శిఖరమై వెలుగొందే సూర్యతేజం

మనస్సుకన్న మారాజుకు ఇచ్చుకుందాం

అక్షర నీరాజనం

మధుసూదనరావు, ఉప సంచాలకులు, విజయ డెయిరీ, హైదరాబాద్ సెల్:9515060693

Related posts

తెలుగు బావుటా

Satyam NEWS

జెర సోచాయించు తమ్మీ….

Satyam NEWS

గణతంత్ర సంబరం

Satyam NEWS

Leave a Comment