32.7 C
Hyderabad
April 26, 2024 23: 07 PM
Slider కవి ప్రపంచం

గణతంత్ర సంబరం

#YalamarthiAnuradhaRD

మూడు రంగుల ముచ్చటైన జెండా మనది

మనమంతా ఒకటే నని

చాటి చెప్పే అజెండా మనది

నాదన్నది వదిలి

అందరి కోసం పాటుపడిన

త్యాగధనుల రూపానికి

ప్రతిరూపమే కదా మన కాషాయం

వెలుగులు పంచే వెల్లువ

సత్యం చూపే తెగువగా

మన మనసుల్లో దాగిన 

ప్రేమ స్వచ్ఛత  తెలిపే తెలుపే కదా

నీలాకాశం నిండుగా ఎగిరి

పైరగాలిని తలపిస్తూ

మట్టిని చెట్టును జీవిని గుర్తుచేసే

పంట బంగారపు పచ్చదనమే మనది

భరత పతాకం ప్రతిరూపమే కదా

గణతంత్రదినోత్సవ ప్రారంభం

ఎగిరేసే ఈ సంబరంతోనే!

యలమర్తి అనూరాధ, హైదరాబాద్, చరవాణి:9247260206

Related posts

ఆన్ లైన్ లో జోగులాంబ అమ్మవారి ఆలయ సేవలు

Bhavani

రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

Satyam NEWS

కంధమాల్ జిల్లా ఎన్ కౌంటర్ లో నలుగురి మృతి

Satyam NEWS

Leave a Comment