38.2 C
Hyderabad
April 29, 2024 14: 01 PM
కవి ప్రపంచం

తెలుగు బావుటా

#S R Pridhvi

పురుషులందున పుణ్య పురుషుడు

అనేందుకు గొప్ప ఉదాహరణ

అక్షర సంపదను మదిoచి

పలు భాషల తత్వాన్ని ఎదలో

నిక్షిప్త పరుచుకున్న విఙాని

విభిన్న రచనల మాధుర్యాన్ని

జాతి ముంగిట పరిచినకాణాచి

కలిసి రాని కాలాన్ని జయించేందుకు

మౌనాన్ని ఆయుధంగా ధరించినవాడు

రాజకీయ రంగమున చతురుడై

ఒర్పును దుస్తులుగా ధరించి

కాలాన్ని జయించిన నేర్పరి

తెలుగు సీమలో వెలుగుల దివ్వె యితడు

దేశ ప్రజల శిరస్సులపై మెరిసిన కిరీటం

జాతి కీర్తి పతాకను

ఎర్ర కొటపై ఎగురవేసిన ధీశాలి

నిరంతర ప్రజా సంక్షేమాన్ని

కళ్ళల్లో కాంతులుగా నింపుకొని

అసాధ్యాలను సాధ్యాలు చేసి

దేశ ప్రగతికి శ్రీకారం చుట్టిన

బహుముఖ ప్రజ్ఞా శాలి!

అనుభవసారాన్నంతటినీ

విశ్వ వేదిక మీద

సంస్కరణల దీపంగా

వెలిగించిన తెలుగు బిడ్డ

నేతలు, ఆశ్చర్య చకితులయ్యేట్టు

పాలనలో పారదర్శకతను

ప్రవహింప చేసిన రాజకీయ దురంధరుడు

నిరంతర శ్రమలోంచి, అనుభవాలను

ఏరి, మూట గట్టిన మహనీయుడు పి.వి.

ఎస్.ఆర్.పృథ్వి, రాజమహేంద్రవరం, Cell:9989223245

Related posts

బహుముఖ ప్రజ్ఞాశాలి

Satyam NEWS

చాక్ పీస్

Satyam NEWS

సమశంఖం పూరిద్దాం

Satyam NEWS

Leave a Comment