41.2 C
Hyderabad
May 4, 2024 17: 45 PM
Slider కవి ప్రపంచం

వేయిపడగలెత్తిన మేధావి

#Vadali Radhakrishna Chirala

మనం బ్రతకాలంటే కలిసి బ్రతకడం నేర్వాలి

ప్రజాస్వామ్యానికి ప్రాణం ఆత్మానుసంధానమచన నైజాన

జ్ఞానం ఏకత్వాన్ని సృష్టింపగల్గుతూనే యుంటుంది

అవను విశ్వ రాజకీయ యవనికపై పరిణతికి ప్రతిక మన పీ.వీ

పరస్పర సద్భావనగా నిశ్చలచిత్తం దార్శనికత్వమై

సంస్కరణల స్వేచ్ఛా వాణిజ్యం..అభ్యుదయ విధి విధానము

ఆర్ధిక శక్తి గా సమైక్యమై విశ్వ ప్రమాణమైన వేళ

విషయ అవనీత తనకు వెన్నతోటి విద్య కాగలుగుతూనేయుంది

మానవ సహజ వికారాలకు తావివ్వని ఋషి పుంగవునిగా

కష్టాలను కడతేర్చగల్గిన ఆధునిక భారత కౌటిల్యునిగా

వ్యుహకర్తగా పరిస్థితుల మధింపులో మహా నేర్పరిగా

సరళీకృత ఆర్ధిక విధాన రూపశిల్పిగా

విశ్వనీయత కల్గిన మౌన మునిగా..రాజయోగిగా

విభిన్న గతుకుల గమనాల మధ్య గమ్యం తప్పని యోధునిగా

నేర్పరికి ఓర్పు ఒక వరం అన్న నానుడికి నిలువెత్తు నిదర్శనం తాను

కుప్పకూలుతున్న వ్యవస్థ ముంగిట విప్లవాత్మక మార్పుగా

డిల్లీ కి రాజుగా,తల్లి కి తనయునిగా చెక్కు చెదరని ఆత్భసౌందర్యమై

సామాన్యులతో కలగలిసిపోయిన అసమాన్యమై

వేయిపడగల మెధావా తాలుకు స్థిత ప్రజ్ఞత,

దార్శనికత

దేశయశస్సును నిత్యం దివ్య తేజోమయం చేయబూనుతూనేయుంది

-వడలి రాధాకృష్ణ, చీరాల

Related posts

“ఫ్రెండ్ షిప్” టైటిల్ లోగో ఆవిష్కరించిన మంత్రాలయం పీఠాధిపతి

Satyam NEWS

పోలీస్ స్టేషన్లో నిర్బంధించి రైతు భూమిలో ప్రత్యర్థుల  రోడ్డు నిర్మాణం

Satyam NEWS

క్రూయల్ ఫెలో: ఇర్ఫానా ను చంపింది స్నేహితుడే

Satyam NEWS

Leave a Comment