31.7 C
Hyderabad
May 7, 2024 01: 10 AM
కవి ప్రపంచం

జీవిత రాట్నం

#Pratapa Venkata Subbaraidu

కడుపునింపుకునే నిత్య రంధిలో

మసి పులుముకొన్న దేహాన్ని

చెరువులో ముంచి తేల్చి

మాసి చిరుగులు పడ్డ బట్టల్ని

దూరంగా విసిరికొట్టి

కొత్తవాటితో..తళతళ్ళాడించాలనిపిస్తుంది

ఆకలి కడుపుకింత

చాయో..బన్నో పడేయకుండా

రుచులు వడ్డించిన విస్తరి ముందు కూర్చుని

ఆస్వాదిస్తూ ముద్దలు నోటికందించాలనిపిస్తుంది

అరెయ్..ఒరేయ్ శబ్దాలు కాకుండా

ఆత్మీయ పలకరింపులు చెవిన పడితే బావుణ్ననిపిస్తుంది

ఒడిలో చేర్చుకునే మానవత్వాన్ని

ఆదుకునే చేతిని చూడాలనిపిస్తుంది

కాల ప్రవాహంలో

జీవం కోల్పోయిన ప్రకృతి, చైత్రంతో పునర్జీవాన్నొంది

రంగులు హంగులతో హొయలుపోతుంది

మానవ జీవితం మాత్రం చీకటి వెలుగుల్ని స్పృశిస్తూ

తిరిగే యాంత్రిక రాట్నం

ఆగేవరకు అనుభూతుల్లేకుండా తిరగడమే దానిపని!

ప్రతాప వెంకట సుబ్బారాయుడు, సికింద్రాబాదు, సెల్: 9393981918

Related posts

చైత్రా రావే

Satyam NEWS

అపర చాణక్యుడు

Satyam NEWS

వర్చువల్ పెయింటింగ్

Satyam NEWS

Leave a Comment