39.2 C
Hyderabad
May 3, 2024 14: 39 PM
కవి ప్రపంచం

తెలుగు కీర్తి – మన పాముల పర్తి

#Sanbhu Damodararao

సీసమాలిక

       వంగర బిడ్డడు వాసి కెక్కె నతండు

             స్వీయ ప్రతిభ తోడ శిస్తు తోడ

       తెలుగు కీర్తి పతాక దీప్తిని జగతిని

             వ్యాప్తి చేసిన ఘనుడు బ్రాహ్మణుండు

       బహు భాష నిష్ణాతు డహమెరుంగని  మూర్తి

             దేశ ప్రధానిగ తిరుగు లేని

       తెలుగు ఠీవి యనగ వెలుగంగ మన “పీ. వి “

             నిస్వార్థి మితభాషి నిత్య స్ఫూర్తి

       కోర లేదు పదవి కోరి వచ్చిన యెడ

             పదవి ఖ్యాతిని పెంచు పండితుండు

        ఆర్థిక సంస్కర్త ! అభినవ చాణక్య !

              తత్వవేత్త ! మౌని ! మేధావి యతడు

ఆ.వె. అల్ప బలము తోడ నైదు వత్సరములు

          దేశమును నడిపిన ధిషణు డతడు

          జన్మ మెత్తి నేడు శత వత్స రమ్ములు

          నారసింహున కివె నతులు శతము .

ఆ. వె. “ వేయి పడగల” కృతివిబుధులు మెచ్చంగ

           అనువదించి యతడు యశము పొందె

           కీర్తి కాంక్ష లేని మూర్తి తెలుగు బిడ్డ

           గుంపు లెఱుగ నట్టి గొప్ప వ్యక్తి.

శంభు దామోదర రావు, హైదరాబాదు

Related posts

వందనం

Satyam NEWS

ప్రకృతి మాత

Satyam NEWS

అ_ ధి_ప_తం_ట… ని_ జ_మా…?

Satyam NEWS

Leave a Comment