33.2 C
Hyderabad
May 15, 2024 19: 49 PM
కవి ప్రపంచం

మన పి.వి

#J.Kondanna Gowlipura

మన మనిషి

గట్టి మనిషి

నేలను విడిచి సాముచేయని మనిషి

అతడొకమంచినీటి సరస్సు

ఆకులందుఅణిగిమణిగిన కవికోకిల

పోటిలో నెగ్గిన ఓడిన

తొణకని నీటికుండ

చట్టం సవరించాడు

పాలనకు పాలకులకు దూరమయ్యాడు

పోరుతెలిసినవాడు

పండితులకు జనవాహినికి చేరువయ్యాడు

ఆశలచిరునవ్వు మోముతో

తపన తాపత్రయం చేతనతో

పడిలేచిన కెరటంలా

ప్రధాని అయ్యాడు

ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడయ్యాడు

మువన్నెల జండా విశ్వంపై రెపరెప లాడించాడు

అతడే మన పి.వి

అతడే ప్రజాహృదయాల్లో చిరంజీవి

– రేడియమ్, పాతనగరం, హైదరాబాద్

Related posts

శ్రమ సంస్కృతి దినోత్సవ”మే” డే

Satyam NEWS

సంభవామి యుగే యుగే

Satyam NEWS

దు:ఖపు మచ్చ

Satyam NEWS

Leave a Comment