38.2 C
Hyderabad
May 1, 2024 21: 01 PM
Slider సినిమా

రాంగ్ గోపాల్ వర్మ చిత్రం పోస్టర్ విడుదల

#WrongGopalVarma

జర్నలిస్ట్  ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. స్టార్ కమెడియన్ షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి ఆవిష్కరించగా… ఈ చిత్రం పోస్టర్ ను మరో మహిళాభ్యుదయవాది సంధ్య ఈరోజు రిలీజ్ చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళల పట్ల చాలా చిన్న చూపు కలిగిన ఓ దర్శకుడి చేష్టలు ఎండగడుతూ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రూపొందిస్తున్న ‘రాంగ్ గోపాల్ వర్మ’ చిత్రాన్ని నేను స్వాగతిస్తున్నాను. డబ్బుల కోసం వ్యక్తిత్వహననాలకు పాల్పడే వ్యక్తుల్ని ఎంతమాత్రం ఉపేక్షించకూడదు” అన్నారు. 

ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలతో విసిగిపోయి తాను ఈ చిత్రాన్ని తెరకెక్కస్తున్నానని షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోందని, ఈ చిత్రం కోసం తాను రాసిన ‘వర్మా వర్మా వర్మా… ఓ రాంగ్ గోపాల్ వర్మ… ఇలా కాలింది ఏమిటయ్యా మా ఖర్మ’ అనే పాట ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా త్వరలో రిలీజ్ కానుందని  రచయిత-దర్శకనిర్మాత ప్రభు తెలిపారు.

Related posts

ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు

Satyam NEWS

ఐపిఆర్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద జర్నలిస్టుల నిరసన

Satyam NEWS

శ్రమకు ప్రత్యామ్నాయం లేదు

Satyam NEWS

Leave a Comment