36.2 C
Hyderabad
May 15, 2024 15: 57 PM
కవి ప్రపంచం

అపర చాణక్యుడు

#Nellutla Sunitha

తెలంగాణ కథని ఖండాంతరాలకు చాటిన మేధస్సు మన పీవి

బహుభాషా కోవిదుడు తన ప్రతిభ అనన్యసామాన్యం

దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపిన మేరునగధీరుడు

శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ మాట్లాడి క్యూబా ను అబ్బురపరిచిన ధీశాలి

భూ దాన ఉద్యమానికి దానమిచ్చి చాటుకుని

సాహితీ పరిమళాలు వెదజల్లినావు

రాజకీయ నేతలతో అగ్ర తాంబూలానికి అర్హుడిగా కాకతీయ పత్రిక ను స్థాపించిన స్వతంత్రుడు!

దేశ హితానికి కోరిన స్థితప్రజ్ఞుడు

జ్ఞాన సరస్వతి సన్నిధిలో అక్షరాభ్యాసం చేసి ఒంగర  ఓనమాలు దిద్దాడు

శాస్త్రీయ సంగీత కీర్తనలు  శ్రావ్యంగా పాడినావు

విశ్వనాథ వేయిపడగలు విజయ కలం పేరుతో సహస్ర పనికి అనువదించి సాహితీ తృష్ణ కు  నిదర్శనాలు

ఆచితూచి మాట్లాడడం చలించని మీ వ్యక్తిత్వం గాంభీర్యం పరిణితి దేశభక్తి సమున్నత వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం

ఇన్సైడర్ విశేష ప్రాచుర్యం తాత్విక ప్రజాహిత నిర్విరామ ప్రయత్నాలు కదా

లోపలి మనిషికి తెలుగులోకి అనువాదం మీ సేవలు సదా స్మరణీయం

కేంద్ర సాహిత్య అవార్డు అందుకొని

కీర్తి కెక్కిన ధ్రువతార

తెలంగాణ జాతి గర్వంగా చెప్పుకునే పాములపర్తి వెంకట నరసింహారావు

హుస్సేన్ సాగర్ తీరాన నీ సమాధి తెలంగాణ ఆత్మాభిమానాన్ని చాటుతుంది

అందుకో పివి అక్షర నీరాజనాలు నీ జన్మదిన సందర్భంగా మా కన్నీటి అశ్రు నివాళులు

-నెల్లుట్ల సునీత, ఖమ్మం

Related posts

యువతీ యువకులారా

Satyam NEWS

కటీ పతంగ్

Satyam NEWS

పాములపర్తి మన ఘనకీర్తి

Satyam NEWS

Leave a Comment