36.2 C
Hyderabad
May 8, 2024 18: 29 PM
Slider కవి ప్రపంచం

కటీ పతంగ్

#K.HarinathSankranthi

ఆకాశంలో గాలి పటాల

కోలా హలాలు కరువై

‘కరోనా’ గగనతలాన్ని కాటేసినట్లు

నగరాకాశం ఎలా వెలవెలబోయిందో చూడు –

చేతి వేళ్ళను ‘మాంజా’తో కఠినంగా

కోసేసినట్లు ‘సులేమాన్’పతంగ్ ధర

మొండిగా ఆకాశానికి అంటుకుని

ఎలా వెక్కిరిస్తుందో చూడు–

వృక్ష జాతుల్ని కూల్చే

దుష్ట ఖడ్గ శక్తుల ధాటికి తట్టుకోలేక

‘చరఖా’ ఎలా చిక్కిపోయిందో చూడు–

డూడూ బసవన్నల మువ్వల సవ్వడులు వినబడక

గజానికో రాజకీయాన్ని సృష్టించే

పరాన్నభుక్కుల పట్టాభిషేక చప్పుళ్ళెలా

చెవుల్ని తూట్లు పొడుస్తున్నాయో చూడు–

అలనాటి హరిదాసుల చిడుతల చప్పుళ్ళు

మచ్చుకైనా వినబడక క్షణక్షణం

విష వాయువుల్ని కక్కుతూ

వాహనాల రణగొణ ధ్వనులతో

నగరం ఎలా వెల వెలబోయిందో చూడు–

గోధూళి కరువై గోడకున్న పిడుకలే గొబ్బిళ్ళై

రాయి ముగ్గులో కల్తీ పిండి కలిసి ముంగిళ్ళలో

ముగ్గులెలా ముడుచుకుపోయాయో చూడు–

చివరికి….

సంక్రాంతి లక్ష్మిని సైతం

తిమిరం మింగేసినట్లు

సెకండ్ ఫేస్ కరోనా అంటూ

మానవాళిని పోటు పొడిచే

మహానగరాలన్నీ

దారం తెగిన గాలిపటాలే

నిజంగా ఈ నగరాలన్నీ

‘కటీ పతంగ్’ లే

కె.హరనాథ్ 9703542598

Related posts

భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రం యాగంటి

Satyam NEWS

రక్షణ కిట్ ఇవ్వకుండా కరోనా విధులు వేస్తే ఎలా?

Satyam NEWS

ప్రపంచం కళ్ళన్నీ.. మోడీ-పుతిన్ సమావేశం మీదే

Sub Editor

Leave a Comment