కవి ప్రపంచం

కావాల్సిందే…..

#Purnima

కావాల్సిందే ఒక గురువు

రాయిని రత్నం చేయుటకు కావాల్సిందే ఒక గురువు

రాజ్యాలని ఏలే రారాజుకయినా

కావాల్సిందే ఒక గురువు

ప్రాణం పోసే వైద్యుడికయినా

కావాల్సిందే ఒక గురువు

దేశ రక్షణకు పోరాటం చేసే యోధుడికయినా

కావాల్సిందే ఒక గురువు

ఏ దేశం వెళ్లినా ఎక్కడ కాలిడినా

కావాల్సిందే ఒక గురువు

జీవనగమనం సరైన దిశలో మలుచుటకి

కావాల్సిందే ఒక గురువు

మోడు బుఱ్ఱ జీవ నదిలా ప్రవహించుటకు

కావాల్సిందే ఒక గురువు

కులమత  బేధాలకు అతీతుడినీ చూపుటకు

కావాల్సిందే ఒక గురువు

రంగులజీవిత  కలలను సాకారం చేసుకొనేందుకూ

కావాల్సిందే ఒక గురువు

సమస్యని సంధించి  విజయం సాధించేందుకూ

కావాల్సిందే ఒక గురువు

పూర్ణిమ

Related posts

కడిగిన ముత్యం

Satyam NEWS

అమ్మ ఓ జీవనది

Satyam NEWS

స్ఫూర్తి నివ్వు

Satyam NEWS

1 comment

Yuddandi Siva Subramanyam July 7, 2021 at 3:47 AM

బాగుంది.

Reply

Leave a Comment