27.7 C
Hyderabad
April 26, 2024 06: 32 AM
Slider కవి ప్రపంచం

అమ్మ ఓ జీవనది

#Purimalla Sunanda Khammam

ఊపిరి పోసుకున్నప్పటి నుండే

కబళించే కత్తుల వంతెనను

హతమార్చే  మంత్రసాని  మొరటు చేతలను తప్పించుకుని..

ఆశల ఆకాశం నుండి

ఈ లోకంలో కి ప్రవహించిన అమ్మ ఓ జీవనది!

నడక ముందుకు పడనీయక

కట్టిన ఆంక్షల అడ్బుకట్టల్లోంచి

మత్తడిగా దూకి వచ్చిన సాహస నది!

కొండల్లాంటి అవరోధాలతో వినమ్రంగా మెలుగుతూ

అనుకున్నది ఆచరించేందుకు

తానొవ్వక ఒప్పించుకుంటూ

గుండెల్లో బాధల్ని దాచుకుని

సాగిపోయే  ఆమె  నిండు  గోదావరి నది!

అననుకూలతను ఒడుపుగా మలుచుకుని

గమ్యాన్ని చేరేందుకు

పరుగులు తీసే తపతి నర్మద నదీమ తల్లుల రూపనది!

అత్తింటి నిండా అనురాగం

పల్లవింప చేసేందుకు 

కన్నె కిన్నెరసానై వచ్చిన  ప్రేమ నది!

పురిటి నొప్పుల వేదనను భరిస్తూ

మరో జన్మకు పురుడు పోసే అమ్మ నది!

ఆమె విసుగు విరామం లేకుండా లేకుండా

అనంత సాగరమై ప్రవహించే హృదయనది!

పచ్ఛఫచ్చని ప్రపంచాన్ని కలగంటూ

ఉర్విలో నిరంతరం సాగిపోయే అమ్మ  ఓ సజీవ నది!

వురిమళ్ల సునంద, ఖమ్మం, 944 1815722

Related posts

మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అరెస్ట్ కు రంగం సిద్ధం

Satyam NEWS

టీఆర్ఎస్ నేతల భూ కబ్జాపై బిజెపి సమరభేరి

Satyam NEWS

మోడల్ ఎమ్మెల్యే: జూబ్లీహిల్స్ లో నిరంతర అన్నవితరణం

Satyam NEWS

Leave a Comment