40.2 C
Hyderabad
May 5, 2024 18: 52 PM
కవి ప్రపంచం

ఠీవి

#Chenna Sai Ramani

వరాల వరంగల్ పుట్టి కాంతుల కరీంనగర్ కి సొంతమై పాములపర్తిగా కీర్తి గడించెను

నిజాం నిరకుంశాలను వందేమాతరం అంటూ ఎదురెళ్లి

స్వాతంత్ర దీక్ష దక్ష దేశభక్తి సమర్పణుడు

బూర్గుల శిష్యరికంతో దృఢచిత్తమును అలవరచుకొని

అవమానాలు రాజకీయంలో ఎదురైనా తలవంచని వ్యక్తి

కఠిన పరిస్థితులను చిటికలో పరిష్కారం చేసినట్టి మేధావి

బహుభాషావేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి

ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఆపద్భావుడు

ప్రధానమంత్రిగా దేశాన్ని ఉక్కు కవచంగా మార్చిన మేధావి

దీక్ష దక్షతతో నిరంతర కృషి సమర్పణలతో

సమస్యలను ధిక్కరించి సంరక్షణ కల్పించిన మహాత్ముడైన ఆదర్శనీయుడు

రాజకీయ చతురత ఓవైపు

సాహిత్య పటిమధాటితో మార్గం చూపే సంరక్షకుడు

అనువాదాలకు దర్శకునిగా,

నిరాడంబరతకు ప్రతి పదార్థంగా

జ్ఞానపీఠను అధిష్టించిన తెలుగు వీరుడు

దేశానికి మకుటంగా నిలిచి మెలుగుతూ

తెలుగు తల్లికి కీర్తిని సాగరములా తరగని ఖ్యాతిని ఇచ్చి

మానవ జాతి అంతటికీ మార్గదర్శకుడు అయ్యి

తెలుగు వాడి రొమ్ము ఎక్కుపెట్టి పి. వి మన అందరికి ఠీవి అని చెప్పుకునేట్టు చేసి

తరగని జ్ఞానశక్తిని తన జీవితంతో మనకి అందించెను

చెన్నా సాయిరమణి

Related posts

ఏరువాక పండగే

Satyam NEWS

ఒకే ఒక్కడు

Satyam NEWS

సంకురాత్రి

Satyam NEWS

Leave a Comment