26.7 C
Hyderabad
April 27, 2024 07: 10 AM
కవి ప్రపంచం

పంద్రాగస్టు

#K.Harinath

విషపురుగుల స్వైరవిహారంతో

సైద్ధాంతిక ధరణీ చక్రం

తిరుగుతోంది అగమ్యగోచరంగా—

నవచేతన పతకానికి

సాలెగూడులా చుట్టుకుంది

మహామారి మాయరోగం—-

ప్రగతిపధం జగతిసిగన

కాంతిపూలు పూయంగా

పుడమితల్లి నెన్నెదుట

విజయతిలకం దిద్దగా

కదలిరండి కదలిరండి

భారత సైంటిస్టులారా

ఉప్పెనలా ధ్వజమెత్తిన

కోవిడ్ ని కట్టడి చేయంగా—

ఎగురుతున్న పతాకమా

మృగ్యమవుతున్న జీవితాలకి

వెలుగుదారి చూపించు

పంద్రాగస్ట్ పర్వదినం

సంబరంగా జరిగేలా

క్రొంగ్రొత్త దారులు చూపుతూ

నీ రాకతో నైనా

ఈ విశ్వం పునీతం కావాలని…….

కె.హరనాథ్ 9703542598

Related posts

వ్యత్యాసం..

Satyam NEWS

స్టైరిన్

Satyam NEWS

ప్రేమించు

Satyam NEWS

Leave a Comment