29.7 C
Hyderabad
May 1, 2024 03: 26 AM
Slider కవి ప్రపంచం

వెన్నెల రేడు

#PVS Krishnakumari

శీతల కిరణాలతో

ధవళ కాంతులు వెదజల్లుతూ

ఏతెంచాడు రేరాజు దర్పంగా 

తారకల మధ్య ..

ధరణి రజిత వస్త్రాన్ని

ధరించి మురిసిపోతున్నది..

తటాకాలలోని కన్నెకలువల

ముఖాలు విప్పారగా

పరవశంతో కాంచసాగాయి

కలువల దొరని…

కఠిన దుర్గం వంటి

హృదయాలు కూడా

వెన్నెలరేడు చల్లదనానికి

మృదుత్వం బొంది

సుందర ఉద్యానవనంగా మారి

మంచి మనసనెడి

మనో పద్మాలను

వికసింప జేయసాగాయి…

అంతటా నిశ్చలత్వం, నిశ్శబ్దం

చిరు అలికిడికే

అద్భుత దృశ్యం

అదృశ్యమై పోతుందేమోనని

 పంచభూతాలన్నీ

ఆ సుధాకరుని అందాన్ని

మౌనంగా  అబ్బురంగా చూస్తూ

ఆస్వాదిస్త్న్నాయి..

వర్ణించ నలవి కాని

ఈ కార్తీక పూర్ణిమ

అందాలను

చూచి తరించాల్సిదే కదా!

పీ.వీ.యస్. కృష్ణ కుమారి

Related posts

వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్న రాష్ట్ర పోలీసులు

Satyam NEWS

బాసరలో ఘనంగా ప్రారంభమైన వసంత పంచమి

Satyam NEWS

చంద్రబాబు పోలీసుల్ని బెదిరించడం శోచనీయం

Bhavani

Leave a Comment