28.7 C
Hyderabad
April 28, 2024 05: 20 AM
Slider కవి ప్రపంచం

జయహో జగజ్జననీ

#K.Veena Reddy

వెండికొండ నుండి వెడలి వచ్చి

భువిని బంగరు కొండవై నిలిచి

బంగరు కుండ బోనం స్వీకరించి

భక్తులకండదండవైన అమ్మతల్లీ

అలనాడు..నగరానికి వరదొచ్చిన కాలంలో..

వరదాయినివై ఆదుకొన్న సింహవాహనీ..

మహత్తుగల మంగళకర మహంకాళివై నీవు

మతాతీత భక్తజన బంధువైనావు.

ఇంటింటి బోనాల ఇలవేల్పువు

వాడ వాడ వేడ్కల నెలతాల్పువు

గోల్కొండ ఎల్లమ్మ, కట్ట మైసమ్మ, లష్కర్ మహంకాళి,

లాల్ దర్వాజ సింహ వాహని

ఎన్నెన్నొ రూపాల వెలసిన జగజ్జననీ

అన్నన్ని బోనాల బొట్ల సహస్ర నయనీ

ఆషాఢ పూజల వెలిగే ఆది శక్తివి

రోగాలణచి బ్రోచే ఆ దివ్య శక్తివి

పోచమ్మ, బాలమ్మ,  ముత్యాలమ్మ, గంగమ్మలనుపేర గ్రామదేవతవై

జగముల రక్షించు ఓ జగదీశ్వరీ

వరములిచ్చి దీవించుమా పరమేశ్వరీ!

కె.వీణారెడ్డి, హైదరాబాద్, 7337058025

Related posts

ది ఫైట్ కంటిన్యూస్: రాయపూడిలో మహిళల జలదీక్ష

Satyam NEWS

కొండ‌వీడు‌లో సంపూర్ణేష్ బాబుతో స్టెప్పులేయించిన నిక్స‌న్

Sub Editor

రాజ్యాంగ స్ఫూర్తిని భావిత‌రాల‌కు అందించాలి

Satyam NEWS

Leave a Comment