33.2 C
Hyderabad
May 15, 2024 11: 10 AM
కవి ప్రపంచం

ఒకే ఒక్కడు..!

#PVNarsaimharao

అనుకున్నామా ఎపుడైనా..?

తెలుగుతేజం ఢిల్లీ పీఠమధిరోహిస్తాడని..!

ఊహించామా ఎపుడైనా..?

తెలంగాణబిడ్డ ప్రపంచఖ్యాతినర్జిస్తాడని..!

కలగన్నారా ఎవరైనా..?

కుదేలైన ఆర్థికరంగాన్ని గట్టెక్కిస్తాడని..!

ప్రజాప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా..

విప్లవాత్మక సంస్కరణలకు ఆధ్యుడతడు..!

ప్రజాజీవనప్రమాణాల మెరుగుదలకు..

అవరోధాలనదిగమించిన నిశ్శబ్ధసేవకుడతడు..!

నిజాం నిరంకుశత్వానికి ధిక్కారస్వరమై..

స్వాతంత్రోద్యమంలో ముందుకురికిన దేశభక్తుడతడు..!

బహుముఖప్రజ్ఞగల బహుభాషాకోవిదుడుగా..

అనన్యసామాన్య సాహితీమేరునగధీరుడతడు..!

సొంతఅవసరాలకు అధికారాన్ని వినియోగించని..

నీతి,నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు..!

పారిశ్రామిక ఉపాధిరంగాలకు ఊతమిచ్చి..

యువతభవితకు బాటలేసిన దార్శినికుడతడు..!

తనకంటూ ప్రత్యేక మందీమార్భలం లేకున్నా..

సుస్థిరపాలన సాగించిన అపర చాణుక్యుడతడు..!

సమూల పరివర్తనకు సంచలననిర్ణయాలతో..

దేశభవిష్యత్తును మలుపు తిప్పిన ధీరోదాత్తుడతడు..!

ఎంతఎదిగినా ఒదిగివుండే నిరాడంబరుడిగా..

అందరితో కలిసిపోయే వివాదరహితుడతడు..!

దేశానికి దిశా నిర్దేశపు మార్గదర్శిగా..

దక్షిణాది సమర్ధతను చాటిచెప్పిన ఒకేఒక్కడు..!

భారతదేశపు ఠీవీ..అతడే మన పి.వి..!!

బాలార్జున సత్యనారాయణ మాకే, అమలాపురం, 9110313596

Related posts

శ్రీ శుభకృతి కృతి

Satyam NEWS

జీవనది

Satyam NEWS

ప్రేమంటే

Satyam NEWS

Leave a Comment