28.7 C
Hyderabad
May 5, 2024 10: 12 AM
కవి ప్రపంచం

పీవీ…మన తెలుగు జాతికి ఠీవీ

#Geetarani Avadhanula

మేరునగధీరుడు…అపర చాణక్యుడు…

తెలంగాణ ముద్దుబిడ్డ…

పట్టు వదలని విక్రమార్కుడు…

బహు భాషా కోవిదుడు..సహజకవి…

ఎన్నో రచనలు వివిధ భాషల నుంచి తెలుగులోకి అనువదించిన మహాజ్ఞాని..

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఏకైక ప్రధాని..

విజ్ఞానఖని.. మౌనముని..

‘ సహస్ర ఫణ్ ‘ విరచితుడు..

‘ లోపలి మనిషి ‘ ద్వారా తన అంతరంగాన్ని ఆవిష్కరించిన ప్రతిభాశాలి…

ధీరోదాత్తుడు, రాజకీయ ఋషి…

మారుమూల పల్లెటూరు లక్నేపల్లి లో పుట్టి వంగరకు దత్తత వెళ్ళిన వాడు..

స్వాతంత్రోద్యమంలో ..హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొన్న ధైర్యశాలి …

బూర్గుల వారి ప్రియ శిష్యుడు… జర్నలిస్టుగా ప్రస్థానం..

‘ జయ ‘ పేరుతో తన ‘ కాకతీయ పత్రిక’లో రచనలు చేసి మెప్పించిన ఘనుడు..

మంథని నుంచి రాజకీయ అరంగేట్రం..

ఎవరిది అండదండలు లేకుండా ఎదిగిన కష్టజీవి…

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన వాడు..

రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి వివిధ పదవులు అలంకరించి…

వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించిన వాడు..

ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన తొలి తెలుగు ప్రధానిగా కీర్తి గడించిన ధీశాలి..

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని గంభీర ముద్రతో నిరూపించిన వారు..

పరిపాలనా దక్షుడు…

ఆధునిక భారత రూపశిల్పి…

నిష్కామ కర్మ యోగి, సౌమ్యుడు…

పాములపర్తి వారి ఇంటి తేజం…

మన తెలుగు తల్లి కీర్తి కిరీటం..

శత వసంతాల మన పీవీ…

తెలుగు జాతికే ఠీవి….

గీతారాణి అవధానుల(మయూఖ), మంథని, పెద్దపల్లి జిల్లా, సెల్ నంబర్. 9491475210

Related posts

సహస్రఫణి

Satyam NEWS

శతాభివందనాలు

Satyam NEWS

లోపలి మనిషి!

Satyam NEWS

Leave a Comment