36.2 C
Hyderabad
May 14, 2024 18: 02 PM
కవి ప్రపంచం

సహస్రఫణి

#Tirunagari Srinivas

బహు భాషల కూడలి                                                     

బహుముఖ ప్రజ్ఞకు ఆకృతి

భాషా వికాసానికి దోసిలి

రాజనీతికి రాజర్షి

పాములపర్తి సదసద్వివివేక గిరిశిఖరి

తెలుగును వెలిగించిన ఋషి

జీవనకోణం భాషేనని విశ్వసించి

పాలన బోధనకు మార్గంగా తీర్చిన శిరోమణి

సాంకేతిక భాషగా ఉన్నతి తెలుగు కిచ్చి

 విశ్వభాషల సరసన నిలిపిన  ధీశాలి

మనీషి, సుమనస్వి, అక్షర  యశస్వి

భాష చైతన్యమే ఆయన పరితపన

వికాసశీలతే ఆయన ఆలోచన

అపర చాణక్యుడు అతడు

సమున్నత  వ్యక్తిత్వ  తేజోనిధి

విశాలత్వం కలిగిన విజ్ఞుడైన ప్రధాని

సాహిత్య సహస్రఫణి, భాషాయోగి

వేయిపడగల అనువాదఝరి

సాటిలేని సృజనశీలి, క్రాంతదర్శి

పీ వీ… మన తెలుగు ఠీవీ

స్వాభిమానతల  ఘనాపాటి.

తిరునగరి శ్రీనివాస్, 8466053933

Related posts

మన రైతు

Satyam NEWS

బోనాల వైభోగం

Satyam NEWS

వెలుగు పువ్వులు

Satyam NEWS

Leave a Comment