25.7 C
Hyderabad
May 24, 2025 08: 58 AM
Slider కవి ప్రపంచం

శక్తి స్వరూపిణి జగజ్జనని

#Puli Jamuna

సురాసురులచే అర్చింపబడే ఆదిపరాశక్తి

అఖిలలోకాలను సంరక్షించే అంబాభవాని

సప్తమాతృకామూర్తిగా ప్రకాశింపబడే జగజ్జనని

సకల జీవకోటికి చైతన్యాన్ని ప్రసాదించే

అపూర్వ మహిమాన్విత దివ్యశక్తి శాంభవి

గ్రామాలలో అమ్మవారు రక్షణ వలయంలా వుంటూ

దుష్టశక్తులను దునుమాడి జనులను రక్షిస్తుందని

సిరి సంపదలు ఆయురారోగ్యసౌభాగ్యాల నిచ్చే

కారుణ్యమూర్తిగా భావించి పలు పేర్లతో పిలుస్తూ

అమ్మోరి జాతరను జరపడం మన సంప్రదాయం

వేల గ్రామాలలో గ్రామ దేవతగా కొలువై

తరతరాలుగా తెలంగాణ జనహృదయంలో నిలిచి

కన్నులపండువగా జరిగే బోనాల జాతరలో

ఎల్లమ్మతల్లిగా భక్తులచే పూజలందుకునే

అనంత శక్తి స్వరూపిణి అనురాగమయి సర్వేశ్వరి

అసురశక్తులు విజృంభించినపుడు చండిగా కాళిగా

పలు అవతారాలెత్తి శుభములనొసగిన శుభంకరి

ఆశ్వయుజంలో నవవిధ అలంకారాలతో

శరన్నవరాత్రులలో దుర్గాదేవిగా సేవించబడుతూ

వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో విరాజిల్లుతూ

భక్తజనులు కొలచినంతనే కొంగుబంగారమై

ఏపేరున పిలిచినా తలచినా శరణువేడినా

ఎల్లలోకములను చల్లగాచూచే తల్లి జగదంబిక

పులి జమున, మహబూబ్ నగర్, 8500169682

Related posts

కనిపించే దేవుడు మహేష్ బాబు: ప్రిన్స్ బాబా

Satyam NEWS

ఆక్షన్:గాలిలో కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్ట్

Satyam NEWS

కారుపై క‌మ‌లం అటాక్‌!!!

Sub Editor

Leave a Comment

error: Content is protected !!