39.2 C
Hyderabad
April 28, 2024 11: 34 AM
Slider విజయనగరం

జనసంధ్రంగా విజయనగరం జొన్నగుడ్డి ఎల్లమ్మ జాతర…!

#vijayanagaram

ప్రతీ ఏడాది మాఘ శుద్ధ అష్ఠమి ,నవమి..రెండు రోజుల పాటు విజయనగరం జొన్నగుడ్డి ఎల్లమ్మ జాతర జరుగుతున్న మాదిరిగా నే ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 27,28 తేదీలలో ఎల్లమ్మ జాతర… భక్తజన సంధ్రం మధ్య వైభవేపేతంగా జరిగింది. తొలి రోజు అంటే మీ ఘ శుధ్ధ అష్ఠమి 27వ తేదీ ఎల్లమ్మ తొలేళ్ల ఉత్సవం జరుగగా..రెండో రోజు మాఘ శుధ్ధ నవమి అంటే 28వ తేదీన సిరిమాను ఉత్సవం ఉత్సాహం జరిగింది.

విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో వన్ టౌన్ సీఐ డా.వేంకటరావు ,ఎస్ఐ అశోక్ లు బందోబస్తు తో ఎల్లమ్మ జాతర ప్రశాంతంగా ముగిసింది. అయితే… విశేషమేమంటే… ఎల్లమ్మ గుడికి కుడివైపున.. బాలాజీ జంక్షన్ వద్ద..రికార్డింగ్ డాన్సుల మాదిరిగా.. నిర్వాహకులు కొన్ని నృత్యాలు ఏర్పాటు చేయడం.. అందుకు వన్ టౌన్ పోలీసులు అనుమతి కోరడం..ససేమీరా అంటే..డీఎస్పీ అనుమతి తో నిర్వాహకులు… డ్యాన్స్ లు ఏర్పాటు చేయడంతో… జాతర కు వచ్చిన భక్తులు… అమ్మ దర్శనం…మరచి…డాన్సులపైనే అదీ రోడ్ మధ్యనే నిల్చొని చూడటం..”సత్యం న్యూస్. నెట్” కు చిక్కింది.

కాగా ఆ రహదారి పై ట్రాఫిక్ ను మధ్యాహ్నం నుంచీ దారి మళ్లించగా..ట్రాఫిక్ ఎస్ఐ లోవ రాజు తమ సిబ్బంది తో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు. అయితే రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వన్ టౌన్ సీఐ డా.వేంకటేశ్వరరావు ,ఎస్ఐ అశోక్ లు దగ్గరుండి భక్తుల రద్దీ లేకుండా.. సజావుగా దర్శనం జరిగేలా చర్యలు చేపట్టారు. అయితే ఆలయ కమిటీ …అమాంతం గా దర్శనానికి టికెట్ ధర యాభై పెట్టడం ..భక్తులు తాకిడి ఎక్కువ అవడంతో… పోలీసులకు పని తగలడంతో…దర్శనానికి కాస్త ఇబ్బందులు వచ్చాయని చెబుతోంది…”సత్యం న్యూస్. నెట్”.

Related posts

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉత్సవ ర్యాలీ

Satyam NEWS

తల్లి బిడ్డల ఆరోగ్యం కోసమే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్

Satyam NEWS

ప్రపంచానికి భారతదేశం అందించిన యోగా నే స్పూర్తి

Satyam NEWS

Leave a Comment