27.7 C
Hyderabad
May 14, 2024 03: 12 AM
Slider కవి ప్రపంచం

శ్రామిక సంక్షేమమే సామాజిక క్షేమం

#K.Veena Reddy Meerpet

సృష్టి నిర్మాణానికి దేవశిల్పుల వంటి విశ్వకర్మలు

సామాజిక నిర్మాణ సాధనాలు శ్రామికులు కార్మికులు!

వాన ధాటికి కరిగి పుట్ట చెదిరిన చీమల్లా

కరోనా కాలంలోని పేద వలస కూలీలు

ఉపాధి లేక, బ్రతుకు దారి లేక,

చేయి సాచలేక

ఊపిరున్నా, పోయినా తమ ఊరిలోనన్న తపనతో

సాగుతున్న సొంతగూటి పాదవాహన ప్రస్ధానంలో

అడుగులకు బరువైన తలమీది మోతలు

వడలిన వనితల ఒడిలోని బుడతలు

కావళ్లలో పిల్లల్ని మోస్తున్న తండ్రులు

బాలింతల, చూలింతల వందలమైళ్ల నడకలు

నెర్రెలిచ్చిన నగ్న పాదముద్రల రక్తపు మరకలు

చెమట చినుకుల్లో మండుటెండల ఛురకలు

గమ్యం చేరకముందే మార్గమధ్య మరణాలు

అనాదిగా సౌందర్యనిధియై పారిన శ్రమజీవనం

గుండెలెండిపోయి, బ్రతుకులు మండిపోయి

అవనీతలమంతా అతలాకుతలమౌతున్నది నేడు!

ఇలా..చెదిరిపోకూడదు శ్రామికజన విశ్వరూపం

ఇల..ఆరిపోకూడదు మన సామాజిక విశ్వదీపం

ఆదుకోవాలి ప్రభుత్వాలే..ఆదరించాలి ప్రజలే!

కె.వీణారెడ్డి, మీర్ పేట్ , హైదరాబాద్-97 సెల్: 7337058025

Related posts

సివిల్ వివాదంలో తలదూర్చిన సిఐ పై సస్పెన్షన్ వేటు

Satyam NEWS

చంద్రబాబును పొగడ్తల్లో ముంచెత్తిన అమిత్ షా

Satyam NEWS

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగలేదు

Satyam NEWS

Leave a Comment