37.7 C
Hyderabad
May 4, 2024 13: 29 PM
Slider కవి ప్రపంచం

ఏరువాక పండగే

#PVS Krishnakumari

ఎన్నో అశలు ఎన్నన్నో కోరికలతో

రైతన్నల పండుగ ఏరువాక పూర్ణిమ

ఏతెంచింది

పోయినేడాది అప్పులే మిగిల్చిందా

ఆదాయాలనే ఇచ్చిందా అనేది పట్టదు

నేడు కోటి ఆశలతో మళ్ళీ హలం పట్టాడు

మన రైతన్న

పడమటి దిక్కున వగలుబోతూ

దోబూచులాడిన మబ్బులు ఆటలాపి

శుభ సూచకంగా చిరుజల్లులతో స్వాగతం పలికాయి

నెర్రెలు విచ్చిన పుడమి

ముందుగానే వచ్చిన

ఎర్రని ఆరుద్ర పురుగులతో

చారల మధ్య ఎర్రచుక్కల చీరె కట్టినట్లు

సింగారించుకుని దుక్కికి సిధ్ధమై

రైతన్నల గుండెల్లోఆనందం నింపింది

పైపై ఆనందమే కానీ, లోనంత దిగులే

సర్కారు సాయం అందుతుందో లేదో!

అన్నదాతకి దానం కోసం ఎదురుచూపులే కదా!

ఏదేమైనా, నష్టం వస్తుందని కర్తవ్యం మానవద్దని

చెప్పే వేదాంతి , రైతన్న కి

ఏరువాక పండగే మరి!

పీ.వి.యస్.కృష్ణకుమారి

Related posts

Analysis: తుంటరి ట్రంప్ పోగాలపు పనులు

Satyam NEWS

మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి

Satyam NEWS

బిఆర్ఎస్ లో చేరిన బిజెపి నేత

Satyam NEWS

Leave a Comment