Slider కవి ప్రపంచం

విలువల దర్పణం

#Nellutla Sunitha New

చరిత్ర పునాదులు తవ్వితే

కుటిలత్వపు కుట్రలలో

కూల్చిన దేవాలయాలేన్నో

అధర్మం రాజ్యమేలిన దండయాత్రలలో ఆలయ సంపదను దోచుకెళ్లిన దోపిడీ వాదులెందరో

కుంచిత స్వభావం పెచ్చు మీరీ మతం పేరిట మారణ హోమాలకు

తెరలేపిన మతోన్మాదులెందరో

అయినా

దురాక్రమాలకు తలవొగ్గని శౌర్యం

అన్నింటిని తట్టుకునే నిలిచిన

జీవన విధానం

భక్తి ఆధ్యాత్మికత వైభవం

ప్రబోధాల నిలయం

నేలను పూజించే గొప్ప సంస్కృతి మొక్కను ఆరాధించే ధర్మం

సమస్త జీవకోటినీ కాపాడే

ధరణి

పుట్టుకే హిందుత్వం

సర్వే జన సుఖినోభవంతు అని

వేద ఆశీర్వాదం చేసినా

జీవకోటి ఆకలి తీర్చే  అన్నపూర్ణగా

స్వచ్ఛమైన మానవీయతకు కొలవై

విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నెలవై

భిన్నత్వంలో ఏకత్వంలా మెలిగే వెలుగై

పంచభూతాల సాక్షిగా సమాహారమై

వేద వేదాంగాల ప్రణవమై

జీవనదుల సంగమమ అపూర్వ సమ్మేళనమై అక్షయమై

నైతిక విలువల దర్పణమై

ఉపనిషత్తుల ఉషస్సుగా

ఎక్కడున్నా పవిత్రమై తోచే

సంస్కృతిని స్వాగతించి

సాంప్రదాయాన్ని గౌరవించి

భావితరాలకు వారసత్వ బహుమతి అందిద్దాం

నెల్లుట్ల సునీత, ఖమ్మం, 7989460657

Related posts

మెక్క గ్రామాన్ని సందర్శించిన అధికారులు

Satyam NEWS

ఆపర్చ్యూనిటీ: గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

Satyam NEWS

ఘనంగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment